Anushka Shetty: వెండితెర జేజమ్మగా, దేవసేనగా నటించిన మెప్పించిన అనుష్క బాహుబలి సినిమా తర్వాత నిశ్శబ్దం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి ఈ సినిమా తర్వాత అనుష్క పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఈ విధంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉండడంతో ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే అనుష్క అధికంగా శరీర బరువు పెరగడంతో శరీర బరువు తగ్గే క్రమంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అనుష్క తాజాగా యూవి క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో అనుష్క నటిస్తున్నారు. ఇందులో ఈమె చెఫ్ పాత్రలో సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమాలో అనుష్క నటిస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఎక్కడ బయట ఫంక్షన్లకు గాని ఇతర ఈవెంట్లలో కూడా కనిపించలేదు. అయితే తాజాగా ఈమె తన కుటుంబంతో కలిసి శివరాత్రి వేడుకలలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అనుష్క శెట్టి తన కుటుంబంతో కలిసి శివరాత్రి వేడుకలలో పాల్గొనగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో ఈమెను చూస్తుంటే అసలు అనుష్కనా ఇక్కడ అనే విధంగా ఉన్నారు. ఈ ఫోటోలలో అనుష్క బాగా బొద్దుగా ఉండడంతో కొందరు ఈమె లుక్ చూసి ఏంటి స్వీటీ ఇలా తయారయ్యారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్కకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…