Karate Kalyani:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి గురించి అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఈమె యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకుంది. ఈ గొడవలో పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
కరాటే కళ్యాణి ఈ విధంగా తనతో గొడవ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ రోడ్డుపై ఫ్రాంక్ పేరుతో మహిళలను అవమాన పరుస్తున్నారు. మరికొన్నిసార్లు స్క్రిప్టెడ్ వీడియోస్ తీసి అందులో అడల్ట్ కంటెంట్ తో మహిళలతో ప్రాంక్ చేస్తూ మహిళలను అవమాన పరుస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి కరాటే కళ్యాణి యూసఫ్ కూడా బస్తీ ప్రాంతంలో యూట్యూబర్ శ్రీకాంత్ తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరస్పరం దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డి గాయాలపాలయ్యారు.ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలను అవమాన పరుస్తున్నారంటూ అతనిని దారుణంగా చితక బాదింది.
ఈ విధంగా వీరిద్దరూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న అనంతరం ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…