Sarkaru Vaari Paata: ఫస్ట్ డే మహేష్ బాబు సర్కారీ వారి పాట ఎంత కలెక్షన్ సాధించిందో తెలుసా?
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతో మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఈ విధంగా ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఇప్పటివరకు మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిందని చెప్పాలి.
గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పరుశురామ్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.అయితే ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా చేరుకోలేక పోయినప్పటికీ మొదటి రోజు మాత్రం భారీ కలెక్షన్స్ సాధించిందని చెప్పాలి. మరి మొదటి రోజు బాక్సాపీస్ వద్ద ఎంత కలెక్షన్లను రాబట్టిందనే విషయానికి వస్తే..
మొదటి రోజు నైజాం ఏరియాలో 10.1 కోట్ల వసూళ్లు రాబట్టగా సీడెడ్ రూ.2.80 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.11, ఈస్ట్ రూ.1.20,వెస్ట్ రూ.2.52 ,గుంటూరు రూ.1.91 కోట్లు,కృష్ణా రూ.0.89 కోట్లు,నెల్లూరు రూ.0.91 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 25 కోట్లు, ఓవర్సీస్ రూ.7.85 కోట్లను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు 58 కోట్ల గ్రాస్ ను, 38 కోయిట్ల షేర్ ను వసూలు చేసింది. ఇలా మొదటి రోజు మహేష్ బాబు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి మొదటి రోజే భారీ మొత్తంలో కలెక్షన్లను రాబట్టిన ఈసినిమా రాబోయే రోజులలో ఎంత కలెక్షన్లను రాబడుతోందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…