Nihaarika : మహేష్ బాబు కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన సినిమా సర్కారు వారి పాట మే 12 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ముందు మహేష్ బాబు ఒక అమ్మాయి తో షార్ట్ వీడియో చేశారు. ఆ అమ్మాయి పేరు నిహారిక. అయితే నిహారిక ఈమధ్య కేజీఎఫ్ 2 సినిమా విడుదల అప్పుడు కూడా కన్నడ స్టార్ హీరో అయిన యష్ తో కూడా షార్ట్ వీడియో చేశారు. తాజాగా మహేష్ తో చేసిన ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది. మహేష్ బాబు దగ్గర వున్నా తాళాల గుత్తు దొంగిలించడానికి నిహారిక చేసే ప్రయత్నాలు, ఈ ప్రయత్నం లో ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోల పక్కన షార్ట్ వీడియోస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబు యష్ వంటి హీరోలు తన పక్కన షార్ట్ వీడియోస్ చేశారు అంటే ఆమె క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఈ నిహారిక ఏంటి ఈ అమ్మాయి ప్రత్యేకత అనేది ఆసక్తిగా మారింది.
అసలు ఎవరు నిహారిక…..
ఇటీవల సినిమాలలోని కొన్ని ఫేమస్ డైలాగ్స్ ని, ఫేమస్ పాటలని, ప్రేమ సీన్ల వంటి వాటిని షార్ట్ వీడియోస్ చేస్తూ చాలా మంది గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పనిని చాలామంది చేస్తూ ఉంటారు. అయితే నిహారిక ఇలాంటి షాట్ వీడియోస్ అన్ని ఏకంగా హీరోలతోనే చేస్తూ వావ్ అనిపించుకుంటోంది. నిహారిక తన ఎంబీఏ ని కాలిఫోర్నియాలోని చాప్మన్ యూనివర్శిటీలో పూర్తి చేసింది. ఫన్నీ వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను సంపాదించుకుంది. నిహారిక వీడియోలంటే మన హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాకు చాలా ఇష్టం అట. చిన్నప్పటి నుండి తెలుగు, తమిళ సినిమాలు చూస్తూ పెరిగిన నిహారిక వీడియోల్లోని జోక్స్‌లో కూడా ఆ సినిమాల ప్రభావం ఎక్కువ గా కనిపిస్తుంది. ఈమెకు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషలు గురించి బాగా తెలుసు. అందుకే నిహారిక ఇంగ్లిష్ మాట్లాడినా సౌత్ వాసన తో ఆకట్టుకునేలా ఉంటుంది . అదే ఆమె వీడియోలు సక్సెస్ అవ్వడానికి ప్లస్ పాయింట్ కూడా.
మహేష్, యష్ తో షార్ట్ వీడియో ల కంటే ముందు ‘రన్‌వే 34’ సినిమాకి ముందు అజయ్ దేవగణ్ తో , ‘జెర్సీ’ విడుదలకు ముందు షాహిద్ కపూర్ తో షార్ట్ వీడియోలు చేసి పేరు సంపాదించుకుంది. నా వీడియోలు చూసి న అభిమానులు పెట్టే కామెంట్లు చదువుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కామెంట్లు చదువుతుంటే తెలియకుండాన న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజ జీవితంలో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఉన్నప్పుడు పుట్టే ఆలోచనలే ఎక్కువ శాతం నేను చేసే వీడియోల్లో కనిపిస్తాయి అని చెప్పింది నిహారిక.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…