Featured

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

Adivi Sesh: విభిన్న కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్ తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్3 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో అడవి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అడివి శేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

Adivi Sesh: సొంతం సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్.. పెద్ద రోల్ అన్నారు చివరికి ఇలా!

ఈ క్రమంలోనే తను ఫస్ట్ సినిమా సొంతం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంతం సినిమా షూటింగ్ సమయంలో తన పాత్ర చాలా పెద్దదని షూటింగ్ కి వస్తే అర్థం అవుతుందని చెప్పారు. దీంతో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. తీరా సినిమాలో తన పాత్ర ఐదు సెకన్లు మాత్రమే ఉందని ఈ సందర్భంగా సొంతం సినిమా గురించి అడివి శేష్ వెల్లడించారు.

నవదీప్ పాత్రలో…

ఇకపోతే నవదీప్,శివ బాలాజీ హీరోలుగా తెరకెక్కిన చందమామ సినిమాలో కూడా ముందుగా తానే నటించాల్సి ఉందని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. చందమామ సినిమాలో కొన్ని రోజుల పాటు షూటింగ్ కి కూడా వెళ్లానని అనంతరం తన పాత్రలో హీరో నవదీప్ ను తీసుకున్నారని వెల్లడించారు.జూన్ మూడో తేదీ విడుదల కాబోతున్న మేజర్ సినిమా గురించి ఈయన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇక ఈ సినిమాని
మహేశ్‌ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్తంగా నిర్మించగా శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago