Featured

Sukumar: అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడంలో తగ్గేదేలే అంటున్న సుకుమార్…

Sukumar: ఆర్య సినిమా తో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించారు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా సినిమాలు అనగానే రాజమౌళి పేరు మాత్రమే ఇండస్ట్రీ లో వినిపించేది. అటువంటివి సుకుమార్ ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తీసి పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించింది అంటే సినిమా విడుదలై చాలా రోజులు అయినప్పటికీ కూడా పుష్ప మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూనే ఉంటారు. అంతలా పుష్ప రాజ్ క్యారెక్టర్ ను జనాల్లోకి ఎక్కించేసాడు. ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

అభిమానులకు పుష్ప2 తో డబల్ ట్రీట్….

గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప2 అంతకుమించి తీసేలా ప్లాన్ వచ్చిందట సుకుమార్కి. ఇప్పటికే ఫిబ్రవరి లేక మార్చ్ లో మొదలు కావాల్సిన పుష్ప2 షూటింగ్ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు. దీనికి కారణం పుష్ప ను మించి పుష్ప 2 ఉండేలా డబుల్ ట్రీట్ తో సుకుమార్ రెడీ చేస్తున్నారని వార్తలు. అందులోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ లాంటి సినిమాలు వచ్చి వెళ్లడం తో అందులో ఉన్న ఎలివేషన్లకు మించి ఇందులో ఉండాలి అని అభిమానులు కోరుకుంటారు ఇందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నారట సుకుమార్‌ టీమ్‌. 

పైగా ఇప్పటికే పుష్ప1 లో శ్రీవల్లి తో పుష్ప పెళ్లి అయిపోవడంతో.. రొమాంటిక్‌ ట్రాక్‌ పెట్టడానికి అవకాశం లేదు. అందుకే ఒక కుర్ర హీరోయిన్‌ను తీసుకొని ‘పుష్ప’రాజ్‌తో కొత్త రొమాంటిక్‌ ట్రాక్‌ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక పుష్ప లో సమంత ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది, అయితే పుష్ప 2 లో కూడా ఐటమ్ సాంగ్ ఐతే పక్కా కాకపోతే సమంత రిపీట్ అవుతుందో లేదో చూడాలి. మొత్తానికి సుకుమార్ కొత్త పాత్రలతో పుష్ప 2 లో అభిమానులకి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

Bhargavi

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

2 days ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

2 days ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

2 days ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

2 days ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

2 days ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

2 days ago