Featured

Sonakshi Sinha: మీతో షేర్ చేసుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.. ఎంగేజ్మెంట్ వార్తల పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి..

Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇటీవల సల్మాన్ ఖాన్, సోనాక్షి వివాహం సీక్రెట్ గా జరిగింది అని ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తర్వాత అందులో నిజం లేదని సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా సోనాక్షి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిపోయింది అని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ‘ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. నేను కన్న పెద్ద కల నెరవేరబోతోంది. అది మీతో పంచుకోవాలనే కుతూహలం నాలో ఉంది. ఇది మీతో షేర్ చేసుకునే రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను’ అంటూ ఒక పోస్ట్ చేసి దీనికి జతగా వేలికి డైమండ్ రింగ్ ఉన్న ఒక ఫోటో ని షేర్ చేసింది. దీంతో అందరు సోనాక్షి నిశ్చితార్థం రహస్యంగా జరిగింది అని అనుకున్నారు. అయితే తన మీద వస్తున్న ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందిస్తూ సోనాక్షి తాజాగా వివరణ ఇచ్చింది.

ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి…..

తన ఎంగేజ్మెంట్ మీద వస్తున్న వార్తలపై స్పందిస్తూ సోనాక్షి మరొక పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు …“ఓకె ఓకె.. నేను మిమ్మల్ని బాగా ఆట పట్టించాలని అనుకున్నా. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఎన్నో క్లూలు ఇచ్చాను. నేను చెప్పినట్టుగానే ఆ రోజు నాకు నిజంగా బిగ్‌ డే..! నా సొంత నెయిల్‌ పాలిష్‌ బ్రాండ్‌ సోయిజీని ప్రారంభించే రోజు, అది నాకు గొప్ప రోజే అవుతుంది కదా. అందమైన నెయిల్స్‌ కోసం ప్రతి అమ్మాయికి సోయిజీ నే చివరి గమ్యం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి రావాలన్నా నా బిగ్గెస్ట్ డ్రీమ్‌ను నిజం చేసుకున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. గోళ్ళకి సోయిజీ నెయిల్‌ పాలిష్‌ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్నా, మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్‌ యూ గాయ్స్‌! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్‌” అంటూ రాసుకొచ్చింది. ఓ రకంగా నేను అందరినీ ఫూల్ చేశాను అన్న భావన తో సోనాక్షి అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago