Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇటీవల సల్మాన్ ఖాన్, సోనాక్షి వివాహం సీక్రెట్ గా జరిగింది అని ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తర్వాత అందులో నిజం లేదని సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా సోనాక్షి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిపోయింది అని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ‘ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. నేను కన్న పెద్ద కల నెరవేరబోతోంది. అది మీతో పంచుకోవాలనే కుతూహలం నాలో ఉంది. ఇది మీతో షేర్ చేసుకునే రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను’ అంటూ ఒక పోస్ట్ చేసి దీనికి జతగా వేలికి డైమండ్ రింగ్ ఉన్న ఒక ఫోటో ని షేర్ చేసింది. దీంతో అందరు సోనాక్షి నిశ్చితార్థం రహస్యంగా జరిగింది అని అనుకున్నారు. అయితే తన మీద వస్తున్న ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందిస్తూ సోనాక్షి తాజాగా వివరణ ఇచ్చింది.
ఎంగేజ్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి…..
తన ఎంగేజ్మెంట్ మీద వస్తున్న వార్తలపై స్పందిస్తూ సోనాక్షి మరొక పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు …“ఓకె ఓకె.. నేను మిమ్మల్ని బాగా ఆట పట్టించాలని అనుకున్నా. నేను ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఎన్నో క్లూలు ఇచ్చాను. నేను చెప్పినట్టుగానే ఆ రోజు నాకు నిజంగా బిగ్ డే..! నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీని ప్రారంభించే రోజు, అది నాకు గొప్ప రోజే అవుతుంది కదా. అందమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి సోయిజీ నే చివరి గమ్యం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి రావాలన్నా నా బిగ్గెస్ట్ డ్రీమ్‌ను నిజం చేసుకున్నాను. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. గోళ్ళకి సోయిజీ నెయిల్ పాలిష్ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్నా, మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్ యూ గాయ్స్! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్” అంటూ రాసుకొచ్చింది. ఓ రకంగా నేను అందరినీ ఫూల్ చేశాను అన్న భావన తో సోనాక్షి అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.


































