Adivi Sesh: అక్కడ భారతీయులను టెర్రరిస్టులుగా చూపిస్తారు… హాలీవుడ్ సినిమాల గురించి అడివి శేష్ కామెంట్స్!
Adivi Sesh: అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా ద్వారా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ విశేషంగా ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అడివి శేష్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఇకపోతే తన తల్లిదండ్రులు అమెరికాలోనే స్థిరపడ్డారని అడవిశేషు వెల్లడించారు.
అమ్మనాన్నలు అమెరికాలో స్థిర పడ్డారు, నువ్వు కూడా ఎంతో అందంగా ఉన్నావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావ్ మరి అక్కడ సినిమాల్లో ఎందుకు నటించలేదు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అడివి శేష్ సమాధానం చెబుతూ హాలీవుడ్ సినిమాలలో ఇండియన్స్ అని చాలా దారుణంగా చూపిస్తారు. అక్కడి సినిమాలలో ఇండియన్స్ కి టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులలో పని చేసే వ్యక్తుల పాత్రలను ఇస్తారు.
ఇప్పటికి హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారు కూడా అక్కడ హీరో కాలేరు. కేవలం కమెడియన్స్ పాత్రలలో నటిస్తున్నారు. అందుకే తాను హాలీవుడ్ సినిమాలలో కాకుండా తెలుగు సినిమాలు చేస్తున్నానని అడివి శేష్ తెలిపారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా మేజర్ సినిమా గురించి కూడా ఈయన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…