Featured

Major Movie: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తండ్రి ఎవరో తెలుసా?

Major Movie: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా, ఆయన పాత్రలో హీరో అడివి శేష్ నటించిన చిత్రం మేజర్. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దేశం కోసం సందీప్ చివరి క్షణం వరకు పోరాడిన తీరును ఎంతో అద్భుతంగా ఈ సినిమా ద్వారా చూపించనున్నారు.

Major Movie: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తండ్రి ఎవరో తెలుసా?

ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీ విడుదల కావడంతో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా మేజర్ హీరో అడవి శేష్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.

Major Movie: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తండ్రి ఎవరో తెలుసా?

ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటి సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ కుమార్తె.మహేష్ మంజ్రేకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఈయన బాలీవుడ్ బోజ్ పురి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

బిగ్ బాస్ వ్యాఖ్యాతగా

ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మరాఠీలో బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఇక ఈయన మొదటగా దీపా మెహతా అనే కాస్ట్యూమ్ డిజైనర్ ను వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు విడాకులు తీసుకొని తరువాత ఈయన మేధా మంజ్రేకర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరిద్దరి కూతురే సాయి మంజ్రేకర్. ప్రస్తుతం ఈమె మేజర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago