Teena: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ అయిన టీనా మృతి చెందారు. ఓంకార్ హోస్ట్ గా నిర్వహించిన ఆట డ్యాన్స్ షో సీజన్ 1 తో టీనా చాలా పాపులర్ అయ్యారు. తరువాత సీజన్ 4 కి టీనా న్యాయనిర్ణేత గా కూడా వ్యవహరించారు. అయితే టీనా ఇన్నాళ్లుగా చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరంగా ఉన్నారు, అసలు టీనా మరణానికి గల కారణాలు అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈరోజు టీనా గోవాలో మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. టీనా సాధు మృతిచెందిన విషయాన్ని ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియచేసారు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హాటాత్తుగా మరణించడంపై తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక ఆట సందీప్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో టీనాతో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ ఈ విధంగా తన భావాలను తెలియజేసారు… ‘టీనా సాధు మరణవార్త విని నేను ఎంతో షాకయ్యాను. టీనా మరణం నన్ను ఎంతో బాధించింది. ఆట సీజన్ 1లో టీనా నా పార్టనర్, టీనా ఎంతో మంచి వ్యక్తి. ఆమె మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. టీనా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఆట సందీప్ తన ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆట సందీప్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…