Categories: FeaturedMovie News

Boya Sunitha: ఆ నిర్మాత పెట్టిన టార్చర్ కి ఐదు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా… బోయ సునీత సంచలన వాఖ్యలు..!

Boya Sunitha: సినిమా పరిశ్రమ పైకి ఎంత అందంగా ఉంటుందో లోపల అన్ని కుళ్ళు విషయాలు ఉంటాయి. ఇక లేడీ ఆర్టిస్ట్ ల కష్టాలు చెప్పనక్కరలేదు. అవకాశాల కోసం వచ్చిన మహిళలను కొంతమంది సినిమా పరిశ్రమలోని వాళ్ళు లైంగికంగా వేధించడం, అవకాశాల కోసం లొంగదీసుకోవడం లాంటి సంఘటనలు తరచూ వింటూనే ఉంటాము. ఇక కొంతమంది బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి వారికి జరిగిన అన్యాయం చెప్తుంటారు. ఇక ఇలాంటి విషయాలను ఈ మధ్యకాలంలో చెప్పే వాళ్లలో శ్రీ రెడ్డి ముందుంటుంది. ఈమె చాలా మంది సినిమా పెద్దల గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఇక ఇపుడు బోయ సునీత అనే ఆర్టిస్ట్ కూడా ఒక పెద్ద నిర్మాత గురించి సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.

నన్ను వ్యక్తిగతంగా టార్చర్ చేసాడు…..

ఇక నిర్మాత బన్నీ వ్యాస్ గురించి బోయ సునీత ఆరోపణల పర్వం ఈమధ్య కొనసాగుతోంది. ఇక తాజాగా బన్నీ వ్యాస్ సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా వ్యక్తిగతంగా బాగా టార్చర్ చేసాడు అంటూ అతని టార్చర్ తట్టుకోలేక నాలుగైదుసార్లు చనిపోవాలని ప్రయత్నించినట్లు వెల్లడించింది. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో తనకు అవకాశాలు ఇవ్వకుండా చేసారు. ఇక వేరే పెద్ద బ్యానర్స్ లో కూడా ఆఫర్స్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించింది.

ఇక ఇదంతా జరిగాక ఇక్కడ సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు రావు, ఎక్కడ ఉద్యోగము రాదు అయిన మూడేళ్ళ నుండి ఒక మహిళ పోరాటం చేస్తుంటే నిప్పు లేనిదే పోగ రాదు కదా అంటూ ఇక ఫైనల్ గా పెద్ద సినిమా బ్యానర్స్ వాళ్ళు నాకు అవకాశాలు ఇవ్వరు అయినా గళమేత్తి నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పాలనుకున్నాను, బన్నీ వ్యాస్ అరాచకాలు మీడియాకు కూడా త్వరలో వెల్లడిస్తానని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో నాకు బాగా మద్దతూ లభిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివర్లో తన ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోమంటూ చెబుతూ త్వరలో సర్కారు వారి పాట సినిమా రివ్యూ పెడుతానంటూ చెప్పడం కొసమెరుపు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago