Categories: FeaturedMovie News

Paruchuri Gopalakrishna: నెల రోజుల నుంచి అభిమానులకు ఎందుకు దూరంగా ఉన్నాడో క్లారిటీ..!

Paruchuri Gopalakrishna: పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలు గానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా నటులుగా వారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. అనురాగ దేవత సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం సైరా నరసింహారెడ్డి వరకు కొనసాగింది. అయితే వీరిద్దరి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వర రావు గారి ఆరోగ్యం బాగోలేదని ఆయన మీద సోషల్ మీడియా లో వచ్చిన కథనాల గురించి తెలిసిందే. గోపాలకృష్ణ గారు యూ ట్యూబ్ లో అప్పుడు అప్పుడు వీడియో లు చేస్తుంటారు. అయితే ఈ మధ్య ఈయన కూడా సరిగా కనిపించక పోవడం తో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇందుకు ఈయన తాజాగా వివరణ ఇచ్చారు.

కంటికి ఆపరేషన్ కారణంగా…..

తాజాగా వచ్చిన అనుమానలకు చెక్ పెడుతూ ఓ కొత్త వీడియో తో అభిమానుల ముందుకు వచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ. ఇలా విడుదల చేసిన వీడియో లో ఆయన ఇలా మాట్లాడారు. ఈ వీడియో లో  తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ గురించి చెబుతూ.. తన కంటికి ఆపరేషన్‌ జరిగిందని తెలియచేసారు. తన కళ్ళకు శస్త్ర చికిత్స జరిగిందని, అందుకే ఒక నెల రోజులుగా యూట్యూబ్‌లో వీడియోలు చేయడం లేదని వివరణ ఇచ్చాడు. ఇంకో రెండు, మూడు వారాలు తన కళ్ళ మీద లైట్‌ ఫోకస్‌ పడకూడదని వైద్యులు సూచించారని చెప్పాడు. అందువల్లే నెల రోజులుగా ఎలాంటి వీడియోలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ.

అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని పరుచూరి వెంకటేశ్వరరావు గారి ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సోదరుడు అయిన గోపాలకృష్ణఈ విషయం మీద స్పందిస్తూ..మా  అన్నయ్య బాగానే ఉన్నారని, బరువు తగ్గడం, ఇంకా జుట్టుకు రంగు వేసుకోకపోవడం తో అలా కనిపించాడని ఆ విషయం లో కూడా తన వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago