Paruchuri Gopalakrishna: పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలు గానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా నటులుగా వారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. అనురాగ దేవత సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం సైరా నరసింహారెడ్డి వరకు కొనసాగింది. అయితే వీరిద్దరి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వర రావు గారి ఆరోగ్యం బాగోలేదని ఆయన మీద సోషల్ మీడియా లో వచ్చిన కథనాల గురించి తెలిసిందే. గోపాలకృష్ణ గారు యూ ట్యూబ్ లో అప్పుడు అప్పుడు వీడియో లు చేస్తుంటారు. అయితే ఈ మధ్య ఈయన కూడా సరిగా కనిపించక పోవడం తో అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇందుకు ఈయన తాజాగా వివరణ ఇచ్చారు.

కంటికి ఆపరేషన్ కారణంగా…..
తాజాగా వచ్చిన అనుమానలకు చెక్ పెడుతూ ఓ కొత్త వీడియో తో అభిమానుల ముందుకు వచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ. ఇలా విడుదల చేసిన వీడియో లో ఆయన ఇలా మాట్లాడారు. ఈ వీడియో లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ గురించి చెబుతూ.. తన కంటికి ఆపరేషన్ జరిగిందని తెలియచేసారు. తన కళ్ళకు శస్త్ర చికిత్స జరిగిందని, అందుకే ఒక నెల రోజులుగా యూట్యూబ్‌లో వీడియోలు చేయడం లేదని వివరణ ఇచ్చాడు. ఇంకో రెండు, మూడు వారాలు తన కళ్ళ మీద లైట్ ఫోకస్ పడకూడదని వైద్యులు సూచించారని చెప్పాడు. అందువల్లే నెల రోజులుగా ఎలాంటి వీడియోలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ.

అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని పరుచూరి వెంకటేశ్వరరావు గారి ఫొటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సోదరుడు అయిన గోపాలకృష్ణఈ విషయం మీద స్పందిస్తూ..మా అన్నయ్య బాగానే ఉన్నారని, బరువు తగ్గడం, ఇంకా జుట్టుకు రంగు వేసుకోకపోవడం తో అలా కనిపించాడని ఆ విషయం లో కూడా తన వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.































