Mahesh babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిల్క్ బాయ్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోస్ లో ఒకడిగా ఉన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికి లాంగ్ రన్ లో హిట్ అయిన సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన సినిమాల రికార్డులు మహేష్ పేరిటే ఉన్నాయి. క్లాస్ గా కనిపించే మహేష్ అమ్మాయిల కలల రాకుమారుడు నాలుగుపదుల వయసులో కూడా ఇప్పటికి గ్లామర్ లో ఏమాత్రం తగ్గని మహేష్ ఇప్పటికి అందగాడే, వయసు తగ్గుతూనే ఉంది.
ఇక మహేష్ సర్కారు వారి పాట సినిమా నేడు విడుదలయి మంచి టాక్ తో నడుస్తోంది. అంతకు ముందు కూడా మహేష్ వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఇపుడు మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న టాప్ హీరోస్ వాళ్ళ రెమ్యూనరేషన్ దాదాపు 30 కోట్లకు పైనే ఉంది. అలాంటిది మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఇక ఎంతుంటుంది అనే చర్చ మొదలయింది. మహేష్ ఒక సినిమాకు పారితోషికం 55 నుండి 65 కోట్లు వరకు తీసుకుంటాడు ఇక ప్రకటనలకు దాదాపు 80 కోట్ల వరకు తీసుకుంటారు. మహేష్ సంపాదన అంత సినిమాలు, ప్రకటనలతోనే వస్తోంది.
మహేష్ ఆస్తుల విలువ ఏంటో….
ఇంగ్లీష్ వెబ్‌సైట్ ప్రకారం, మహేష్ బాబు ఆస్తి 32 మిలియన్ డాలర్లు అంటే అక్షరాలు రూ. 244 కోట్లు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహేష్ బాబు నిర్మించుకున్న విలాసవంతమైన విల్లా ధర దాదాపు 30 కోట్ల రూపాయలు. ఇక బెంగుళూరులో కూడా అంతే విలువ చేసే ఇల్లు కొన్నాడు. ఈ ఇళ్లలో జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్ లాంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక కార్ల విషయానికి వస్తే మహేష్ కు కార్లు అంటే చాలా ఇష్టం అందుకే లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. 3కోట్ల విలువ చేసే లాంబోర్గినీ గల్లార్డో, 90 లక్షలు విలువ చేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్, 49 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ మరియు 2 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, 1.12 కోట్లు విలువ చేసే ఆడి ఎ8 కార్లు ఉన్నాయి. ఇక మహేష్ షూటింగ్ కోసం వాడే వ్యానిటీ వెహికల్ ధర 6కోట్లు. ఇందులో బాత్‌రూం, కిచెన్, స్పెషల్ సిట్టింగ్, టీవీ వంటి సదుపాయాలు ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…