Tag Archives: posani krishna murali

మీరు అది నిరూపిస్తే.. తనను చెంప దెబ్బ కొట్టొచ్చు: పోసాని

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో మాట్లాడిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.జగన్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు.. సినీ పరిశ్రమ మనిషి అని పోసాని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ రెమ్యూనరేషన్ పై అతడు స్పందించాడు. పవన్ రెమ్యూనరేషన్ రూ.10 కోట్లా.. రూ.50 కోట్లా.. అని ప్రశ్నించారు. పవన్ కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు..

కానీ తాను రూ.15 కోట్లు ఇస్తానని.. తన నాలుగు సినిమాలకు సంతకం చేస్తాడా.. అంటూ ప్రశ్నించాడు. అతడు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని నిరూపిస్తే.. తనను చెంప దెబ్బ కొట్టండంటూ.. సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని వెటకారంగా అన్నారు. జగన్ తో అసలు పవన్ కి పోలికే లేదని మండిపడ్డారు.

సీఎం జగన్ కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. ‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ తో పోల్చుకుని వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. ఇకపోతే తనకు.. చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవని స్ఫష్టం చేశారు. పవన్ సినిమాలకు టిక్కెట్ రెట్లు రూ. 500, రూ.1000 అంటే ఏంటి.. మధ్య తరగతి మరియు సామాన్యులను హింసించడమే కదా అంటూ ప్ర‌శ్నించారు.

నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన శ్రీకాంత్.. ఎవరూ గుర్తుపట్ననే లేదట..!

పోసాని కృష్ణ‌ముర‌ళి ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి.

అందులో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఆపరేషన్ దుర్యోదన’ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అందులో శ్రీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. రాజకీయ నేపథ్యంలో తీసిన ఈ సినిమా కొంత కాంట్రవర్సీలకు వెళ్లినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమకు హైలెట్ గా నిలిచే సీన్ ఏంటంటే.. శ్రీకాంత్ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం. అది శ్రీకాంత్ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. దాని వెనుక ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్తే.. మొదట పోసాని ఈ కథ గురించి శ్రీకాంత్ కు చెబుతున్న సమయంలోనే ఈ సీన్ క్లియర్ గా వినిపించాడట. ఈ సీన్ సినిమాకు పెద్ద ప్లస్ అని.. ఈ సీన్ పైనే కథ ఆధారపడి ఉంటుందని చెప్పగానే.. చేసేద్దామని.. శ్రీకాంత్ ఒప్పుకున్నాడు.

కానీ అది హైదరాబాద్ లో తీసే సీన్. శ్రీకాంత్ ను ఎవరైనా గుర్తుపడితే ఎలా అనే సందేహంతోనే.. సీన్ ను మొదట చార్మినార్ దగ్గర చేశారట. కానీ అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తర్వాత అమీర్ పేట్ లో కూడా ఆ సీన్ ను తీశారు. శ్రీకాంత్ వేషధారణ వల్ల ఎవరో పిచ్చివాడు అనుకున్నారే తప్ప అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తీరా సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ చూసిన వాళ్లకు అర్థం అయింది.. అక్కడ ఆ సమయంలో జనం మధ్యలో నుంచి వెళ్లింది శ్రీకాంత్ అని. నిజంగా ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ అయ్యింది.

సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను నేర్చుకున్నది ఏం లేదు.. పోసాని షాకింగ్ కామెంట్స్?

పోసాని కృష్ణమురళి.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక నటుడిగా.. రచయితగా.. నిర్మాతగా.. డైరెక్టర్ గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో అన్నింట్లోనూ ఆరితేరిన వ్యక్తి. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ అయినా.. తండ్రి క్యారెక్టర్ అయినా.. కమెడియన్ గా అయినా.. అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే.. పోసానికి వెన్నతో పెట్టిన విద్య. ఇట్టే అవలీలగా నటించేస్తారు పోసాని. అందకే.. పోసాని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయిపోయారు.

అయితే.. పోసాని కృష్ణమురళి.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పెద్దగా నేర్చుకున్నది ఏం లేదట. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలో చదువుతున్న సమయంలోనే యాక్టింగ్ చేసేవారట. అప్పుడు యాక్టింగ్ లో ఎన్నో అవార్డులు వచ్చాయట. స్కూల్ డేస్ ను నేను బెస్ట్ కమెడియన్ ను. నాగార్జున యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ ను. మద్రాస్ యూనివర్సిటీలోనూ మంచి యాక్టర్ ను. ఆ తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీకి రాకముందే.. యూనివర్సిటీలలోనే నాకు చాలా అవార్డులు వచ్చాయి.. అని పోసాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరా

మద్రాస్ లో ఎంఫిల్ చేస్తున్న సమయంలో.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర పార్ట్ టైమ్ రైటర్ గా జాయిన్ అయ్యారు పోసాని. ఆ పార్ట్ టైమ్ కాస్త ప్రస్తుతం లైఫ్ లోనే పార్ట్ అయిపోయింది అని పోసాని తెలిపారు. ఏదో పాకెట్ మనీ కోసం రైటర్ గా మారితే.. ఇప్పుడు అదే వృత్తి అయిపోయింది. అసలు రైటర్ అవ్వాలన్న ఆలోచనే తనకు లేదట. వాళ్ల ఫ్యామిలీలో ఎక్కువ చదువుకున్నది పోసాని మాత్రమే. అందుకే.. తాను ఏనాడూ రచయిత కావాలని ఆలోచించలేదు కానీ.. పాకెట్ మనీ కోసం పరుచూరి బ్రదర్స్ దగ్గర రచయితగా చేరారు పోసాని.

పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలనుకున్నా

నిజానికి పోసాని కృష్ణమురళి యాక్టర్ కావాలని కానీ.. సినిమా ఇండస్ట్రీలోకి కానీ రావాలని ఏనాడూ అనుకోలేదట. ఆయనకు చదువుకుంటున్న రోజుల్లో పోలీస్ ఆఫీసర్ కానీ.. లెక్చరర్ కానీ కావాలని అనుకున్నారట. కానీ.. అనుకోకుండా.. రచయితగా మారడం.. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. దీంతో సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది పోసానికి. మనం ఏం అవ్వాలో లైఫే డిసైడ్ చేస్తుంది. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. నా రైటింగ్ స్కిల్స్ పరుచూరి బ్రదర్స్ కు నచ్చడంతో నాకు అవకాశం ఎక్కువ ఇచ్చారు.. అని పరుచూరి చెప్పారు.

ఒక సినిమా ఫుల్ స్క్రిప్ట్ ను పరుచూరి గోపాలకృష్ణ మూడు రోజుల్లో రాసేస్తారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా స్క్రిప్ట్ ను అత్యంత వేగంగా రాసే రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటూ పోసాని చెప్పుకొచ్చారు. ఒక సినిమా స్క్రిప్ట్ ను పూర్తిగా అన్ని డైలాగ్స్ తో కలిపి కేవలం 3 రోజుల్లో రాసేస్తారట ఆయన. ఆయన అంత ఫాస్ట్ గా ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాసేవాళ్లు లేరని పోసాని అన్నారు. కాకపోతే.. నేను కూడా రెండు రోజుల్లోనే రాసేవాడిని కానీ.. పరుచూరి అంత పర్ ఫెక్ట్ గా రాసేవాడిని కాదు.. అంటూ పోసాని కృష్ణమురళి చెప్పారు.