పోసాని కృష్ణమురళి ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాయి.
అందులో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఆపరేషన్ దుర్యోదన’ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అందులో శ్రీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. రాజకీయ నేపథ్యంలో తీసిన ఈ సినిమా కొంత కాంట్రవర్సీలకు వెళ్లినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమకు హైలెట్ గా నిలిచే సీన్ ఏంటంటే.. శ్రీకాంత్ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం. అది శ్రీకాంత్ ఎలాంటి డూప్ లేకుండా చేశాడట. దాని వెనుక ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్తే.. మొదట పోసాని ఈ కథ గురించి శ్రీకాంత్ కు చెబుతున్న సమయంలోనే ఈ సీన్ క్లియర్ గా వినిపించాడట. ఈ సీన్ సినిమాకు పెద్ద ప్లస్ అని.. ఈ సీన్ పైనే కథ ఆధారపడి ఉంటుందని చెప్పగానే.. చేసేద్దామని.. శ్రీకాంత్ ఒప్పుకున్నాడు.
కానీ అది హైదరాబాద్ లో తీసే సీన్. శ్రీకాంత్ ను ఎవరైనా గుర్తుపడితే ఎలా అనే సందేహంతోనే.. సీన్ ను మొదట చార్మినార్ దగ్గర చేశారట. కానీ అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తర్వాత అమీర్ పేట్ లో కూడా ఆ సీన్ ను తీశారు. శ్రీకాంత్ వేషధారణ వల్ల ఎవరో పిచ్చివాడు అనుకున్నారే తప్ప అతడిని ఎవరూ గుర్తుపట్టలేదు. తీరా సినిమా విడుదలైన తర్వాత ఆ సీన్ చూసిన వాళ్లకు అర్థం అయింది.. అక్కడ ఆ సమయంలో జనం మధ్యలో నుంచి వెళ్లింది శ్రీకాంత్ అని. నిజంగా ఈ సన్నివేశం సినిమాకి హైలెట్ అయ్యింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…