టీం ఇండియా క్రికెటర్.. డాషింగ్ ఒపెనర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకు ఎందుకు ఇలా తెరపైకి వచ్చిందంటూ.. ఆయేషా ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో ఎంతో ఎమోషనల్ తో చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే అప్పటికే వివాహం అయిన ఆయేషా ముఖర్జిని 2012 సంవత్సరంలో శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన పిల్లలతో ఉన్న ముఖర్జిని పెళ్లి చేసుకున్న ధావన్ .. పెళ్లి సమయంలో కూడా ఆమె కూతుళ్లను బాగా చూసుకుంటానని మాట ఇచ్చి.. ఇంట్లో పెద్ద ఒప్పుకోకపోయిన ఆమెపై ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2014 సంవత్సరంలో అతడికి ఒక కొడుకు పుట్టాడు. ఇంత బాగా అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్క సారిగా విడాకులు టాపిక్ రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులంటే అదేదో చెడ్డ పదంలా భావించేదాన్ని. ఫన్నీ… విడాకులు, వివాహం వంటి పదాలకు ఎంత శక్తివంతమైన అర్థాలు,అనుబంధాలు ఉంటాయో. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో నేనేదో విఫలమైనట్లు… చేయకూడని తప్పు చేసినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను.
అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది ఊహించుకుంటే భయానకంగా ఉంది. ఇప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలని అయేషా ముఖర్జీ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం డాషింగ్ ఓపెనర్ ‘గబ్బర్’(శిఖర్ ధావన్) ఐపీఎల్ సెకండ్ హాఫ్‌లో ఆడేందుకు యూఏఈ వెళ్లాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ టీమ్‌తో యూఏఈలో ఉన్నాడు. ప్రస్తుతం తన భార్య ఆయేషా ముఖర్జి పోస్టు చేసిన దీనికి శిఖర్ ధావన్ స్పందించలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…