Tag Archives: postponed

Bheemla Nayak: ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందిగా… భీమ్లా నాయక్ సినిమాను ముందుకు తెండి.. పవన్ ఫాన్స్ డిమాండ్!

Bheemla Nayak: దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7వ తేదీ విడుదల అవుతున్నట్టు చిత్ర బృందం ప్రకటించడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్ర బృందం అభిమానులకు చేదు వార్త తెలియజేస్తూ ఈ సినిమా విడుదల వాయిదా పడిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఎంతో సంతోషపడ్డారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా జనవరి 7న విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా పోస్ట్ ఫోన్ చేయించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రాజమౌళి సినిమా పై దాడి చేశారు.

Bheemla Nayak: ఆర్ఆర్ఆర్ వాయిదా పడిందిగా… భీమ్లా నాయక్ సినిమాను ముందుకు తెండి.. పవన్ ఫాన్స్ డిమాండ్!

అయితే ఈ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడిన విషయం తెలియడంతో పవన్ అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒమిక్రాన్ వల్ల వాయిదా పడటంతో ఆ తర్వాత విడుదల కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వాయిదా పడుతుందని వార్తలు వినబడుతున్నాయి.

పండగ చేసుకుంటున్న చిన్న సినిమాలు…

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ చేసుకుంటున్నాయి. ఇలా నాగార్జున బంగార్రాజు, హీరో, రౌడీ బాయ్స్ వంటి చిత్రాలు సంక్రాంతి బరిలో దిగటానికి సిద్ధం అయ్యాయి. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమా విడుదల ఉండదని హింట్ ఇచ్చిన అభిమానులు మాత్రం ఈ సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

RRR Movie: RRR అభిమానులకు షాకింగ్ న్యూస్.. మరోసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా..

RRR Movie: గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయం మరి కొద్ది రోజులలో రానుందని తెలియడంతో ఎంతో మంది సినీ ప్రేమికులు, తారక్ అభిమానులు, చెర్రీ అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. అయితే ఈ సినిమా ఎలాంటి పరిస్థితిలోనైనా జనవరి 7వ తేదీ విడుదల చేస్తామని ప్రకటించిన దర్శకుడు రాజమౌళి ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

RRR Movie Postponed for a Later date

నూతన సంవత్సరం కానుకగా అభిమానులకు జక్కన్న చేదు వార్తను చెప్పబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలో పలు ఆంక్షలు విధించారు. దీంతో థియేటర్లు కూడా మూతపడే దిశగా అడుగులు వేయడంతో ఈ సినిమా విడుదల పై నిర్మాతలు మరోసారి ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.

RRR Movie: తారక్, చెర్రీ అభిమానులకు చేదు వార్త.. మరోసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సినిమా..?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వివిధ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కనుక ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో ఈ సినిమా జనవరి 7వ తేదీ విడుదల కాకుండా వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల వాయిదా పై నేడు ప్రకటించే అవకాశం ఉంది.

వేసవి సెలవులలో విడుదల కానున్న RRR..

ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడితే ఈ సినిమాను వచ్చే వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసినప్పటికీ ఈ సినిమా విడుదల వాయిదా వైపు అడుగులు వేస్తోందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి నూతన సంవత్సరం కానుకగా ఈ సినిమా విడుదల పై జక్కన్న ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. బ్యాక్ లాగ్స్ ఉంటే ఇలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులో ఉధృతమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఎటువంటి పరీక్షలు లేకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.

ఈ క్రమంలోనే రెండవ సంవత్సరం పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జూన్ నెలలో పరిస్థితులను బట్టి రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీంతో మే 1 నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేశారు.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను జూన్ నెలలో పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే 15 రోజులు ముందుగానే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు బ్యాక్‌ల్యాగ్స్‌ ఉంటే కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని తెలియజేసింది.

అయితే ఇది కేవలం బ్యాక్‌ల్యాగ్స్‌ ఉన్న విద్యార్థులకు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 1,99,019 మంది విద్యార్థులు కనీస మార్కులతో ఉత్తీర్ణులుకానున్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను కూడా వాయిదా వేస్తూ రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంసెట్ లో 25 శాతం మార్కుల వెయిటేజీని కలుపుకునేది. అయితే ఈ ఏడాది 25% మార్కుల వెయిటేజీ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.