ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులో ఉధృతమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఎటువంటి పరీక్షలు లేకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.
ఈ క్రమంలోనే రెండవ సంవత్సరం పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జూన్ నెలలో పరిస్థితులను బట్టి రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీంతో మే 1 నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేశారు.
ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను జూన్ నెలలో పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే 15 రోజులు ముందుగానే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు బ్యాక్‌ల్యాగ్స్ ఉంటే కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని తెలియజేసింది.
అయితే ఇది కేవలం బ్యాక్‌ల్యాగ్స్ ఉన్న విద్యార్థులకు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 1,99,019 మంది విద్యార్థులు కనీస మార్కులతో ఉత్తీర్ణులుకానున్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను కూడా వాయిదా వేస్తూ రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంసెట్ లో 25 శాతం మార్కుల వెయిటేజీని కలుపుకునేది. అయితే ఈ ఏడాది 25% మార్కుల వెయిటేజీ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…