ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులో ఉధృతమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఎటువంటి పరీక్షలు లేకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు.

ఈ క్రమంలోనే రెండవ సంవత్సరం పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం జూన్ నెలలో పరిస్థితులను బట్టి రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. దీంతో మే 1 నుంచి 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేశారు.

ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలను జూన్ నెలలో పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే 15 రోజులు ముందుగానే పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు బ్యాక్‌ల్యాగ్స్‌ ఉంటే కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని తెలియజేసింది.

అయితే ఇది కేవలం బ్యాక్‌ల్యాగ్స్‌ ఉన్న విద్యార్థులకు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 1,99,019 మంది విద్యార్థులు కనీస మార్కులతో ఉత్తీర్ణులుకానున్నారు. ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను కూడా వాయిదా వేస్తూ రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంసెట్ లో 25 శాతం మార్కుల వెయిటేజీని కలుపుకునేది. అయితే ఈ ఏడాది 25% మార్కుల వెయిటేజీ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here