Tag Archives: Prashanth Varma

Prashanth Varma: హనుమాన్ డైరెక్టర్ కు కోట్లు విలువచేసే గిఫ్ట్ ఇవ్వబోతున్న నిర్మాత?

Prashanth Varma: హనుమాన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా ద్వారా ఈయన పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకున్నారు.

40 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకేక్కిన ఈ సినిమా ఏకంగా 270 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఈ స్థాయిలో లాభాలను అందుకోవడంతో ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన కానుకను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.

ఖరీదైన రేంజ్ రోవర్ కారు కానుకగా ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే లేటెస్ట్ మోడల్ కారును కూడా బుక్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా హనుమాన్ సినిమా సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ ఖరీదైన కారును బహుమతిగా అందుకోబోతున్నారని తెలుస్తుంది.

ఆరు కోట్లు..

ఇటీవల కాలంలో ఏదైనా సినిమా మంచి సక్సెస్ అయితే దర్శకులకు హీరోలకు నిర్మాతలు ఇలా ఖరీదైన కానుకలను అందిస్తుండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ నుంచి కారును అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ కారు విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఇక హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా పనులలో బిజీ అయ్యారు.

Prashanth Varma: ఆ చెత్త భోగిమంటల్లో వేయండి.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశాంత్ వర్మ?

Prashanth Varma: ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటి నుంచి సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఏమాత్రం థియేటర్లను కేటాయించలేదు. అదేవిధంగా సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అంటూ నిర్మాతల పై ఒత్తిడి కూడా వచ్చిందని తెలుస్తుంది. అయితే వాటన్నింటిని అధిగమించి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.

ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమా పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి ఈ సినిమాపై చెడు ప్రచారం మొదలు పెడుతున్నాయి. ఇలా ఈ సినిమా గురించి చెడు ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమాన్ టీమ్ పై దాడి..

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా సినిమా పట్ల జరుగుతున్నటువంటి చెడు ప్రచారంపై స్పందిస్తూ.. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొందరు హనుమాన్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఈ చెత్తను భోగి మాటల్లో కాల్చేయాలని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.