Prashanth Varma: హనుమాన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా ద్వారా ఈయన పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకున్నారు.
40 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకేక్కిన ఈ సినిమా ఏకంగా 270 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఈ స్థాయిలో లాభాలను అందుకోవడంతో ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన కానుకను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.
ఖరీదైన రేంజ్ రోవర్ కారు కానుకగా ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే లేటెస్ట్ మోడల్ కారును కూడా బుక్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా హనుమాన్ సినిమా సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ ఖరీదైన కారును బహుమతిగా అందుకోబోతున్నారని తెలుస్తుంది.
ఆరు కోట్లు..
ఇటీవల కాలంలో ఏదైనా సినిమా మంచి సక్సెస్ అయితే దర్శకులకు హీరోలకు నిర్మాతలు ఇలా ఖరీదైన కానుకలను అందిస్తుండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ నుంచి కారును అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ కారు విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఇక హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా పనులలో బిజీ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…