Amardeep Chowdary: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో అమర్ దీప్ చౌదరి ఒకరు. అమర్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమర్ రన్నర్ గా బయటకు వచ్చారు.
ఇక బిగ్ బాస్ తర్వాత ఈయనకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా కెరియర్ పరంగా కూడా బిజీ అవుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత అమర్ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా ఈయన మొదటి సినిమా పూజ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా పూర్తి చేసుకున్నారు.
అమర్ తన మొదటి సినిమా పూజా కార్యక్రమం నేడు ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో ఎంతో ఘనంగా జరిగాయి ఇక హీరోగా అమర్ వెండి తెర ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా ఎంపిక అయ్యారు.
హీరోయిన్ గా సుప్రీత..
ఈ సినిమా M3 మీడియా బ్యానర్లో,మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో వీరితో పాటు పలువురు సీనియర్ నటీనటులు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…