Nikhil Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పరిచయమైనటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నిఖిల్ సిద్ధార్థ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన భార్య పల్లవి తల్లి కాబోతుంది అనే విషయాన్ని ఈయన వెల్లడించారు.
పల్లవి నిఖిల్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పల్లవి వృత్తిపరంగా వైద్యరాలు. ఇక ఈ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదే విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మీ ఆశీర్వాదం కావాలి…
ఇలా సీమంతపు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి నిఖిల్.. తన భార్య పల్లవికి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం జరిగిందని తెలిపారు. త్వరలోనే మేము మా మొదటి బిడ్డకు స్వాగతం పలకపోతున్నామని తెలిపారు. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలి అంటూ నిఖిల్ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో నిఖిల్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…