Tag Archives: Pregnant woman

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే యువత ప్రేమ పేరుతో తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2021లో వివాహం చేసుకున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వివాహం తర్వాత దంపతులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటూ మూడు నెలలపాటు కాపురం చేశారు. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కారణంగా పెద్దమనుషుల సలహా మేరకు దేవేంద్ర కుమార్ దంపతులు పట్టణంలోని 12వ వార్డులోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వేరు కాపురం పెట్టిన కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కుసుమలక్ష్మి ఫోన్ చేసి తన తల్లికి చెప్పి బాధ పడింది. కుసుమ లక్ష్మి తల్లి తన కూతురిని ఓదార్చి తాను వస్తున్నానని.. గొడవ పడొద్దని కూతురితో చెప్పింది. కుసుమ లక్ష్మి తల్లి ఇంటినుండి బయలుదేరి కూతురు ఇంటికి వచ్చేలోపు తన కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ శవమై కనిపించింది. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో కూతురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేపట్టారు.

అదనపు కట్నం కోసం వేధింపులు…

ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి తల్లిని విచారించగా.. పెళ్లి అయిన సమయం నుండి తన కుమార్తె అత్త ,మొగుడు ,బావ ,ఆడపడుచు నిత్యం తన కూతురిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారని ఆమె చెప్పుకొచ్చింది. వారి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె 5 వారాల గర్భిణీ అని, బుధవారం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకువచ్చారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. అక్కడ తొలి కేసు నమోదు.. !

కరోనా కారణంగా ప్రతీ ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. సెకండ్ వేవ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నా.. మరీ విపరీతంగా మాత్రం లేవు. వచ్చే నెల నుంచి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు దాని భారి నుంచి రక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జికా వైరస్ కలవరపెడుతోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. రూరల్ పుణెలోని పురందర్‌లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఐదుగురి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. బెస్లార్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జులై 30వ తేదీన ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.

జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు అని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవాతె అంటున్నారు. బాధితురాలి కుటుంబంలో మరెవరికీ జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ఐతే ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారు. వారిలో కొందరికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. జికా వైరస్ అనేది దోమ కుట్టిన 14 రోజుల తర్వాత బయటపడుతుందని తెలిపారు.

ఎడిస్ ఈజిప్ట్ అనే దోమల జాతి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అందుకే వర్షా కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నామని.. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తామని జిల్లా అధికారి తెలిపారు.

అబార్షన్ చేయించుకోవడం మన దేశంలో నేరమా? ఎందుకు?

సాధారణంగా మహిళల గర్భంలో పెరుగుతున్న పిండం బయటకు తొలగించడాన్ని గర్భస్రావం అంటారు. అయితే ఇది మానవ ప్రమేయం లేకుండా అదంతట అదే అబార్షన్ జరిగితే దానిని అబార్షన్ లేదా గర్భస్రావం అని అంటారు. మన దేశంలో దాదాపు 30 నుంచి 40 శాతం మహిళలు ఈ విధమైనటువంటి గర్భస్రావం ఎదుర్కొంటున్నారు. మానవ ప్రమేయం లేకుండా జరిగే దానిని గర్భస్రావం అంటారు.

కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా గర్భంలో పెరుగుతున్న టువంటి పిండాన్ని తొలగించడాన్ని ప్రేరేపిత గర్భస్రావం అంటారు. ఆకస్మిక గర్భస్రావాన్ని న్యాయపరమైన, వైద్య పరిభాషలో అబార్షన్‌గా పరిగణించరు. ఈ విధమైనటువంటి అబార్షన్ కొన్నిసార్లు మనదేశంలో చట్టపరంగా న్యాయమైనది అయితే కొన్నిసార్లు, చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.

గర్భంలో పెరుగుతున్న పిండం కొన్ని అనివార్య కారణాల వల్ల గర్భస్రావం జరిగితే ఆ పిండం తొలగించడం కోసం చేసే అబార్షన్ చట్టపరంగా న్యాయమైనదే. మరికొందరిలో పిండం ఎదుగుదలలో లోపాలు ఏర్పడినప్పుడు ఆ పిండాన్ని తొలగించడాన్ని న్యాయమైనదిగా భావిస్తారు. అయితే ఈ విధంగా కడుపులో పెరుగుతున్న బిడ్డను తొలగించడానికి కేవలం గర్భం మోస్తున్న మహిళా అనుమతి చాలు. అయితే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సున్న వారికి,మతిస్థిమితం లేని వారికి అబార్షన్ చేయాలంటే తప్పనిసరిగా సంరక్షకుల అనుమతి అవసరం.

కొందరు మహిళలు లింగ వివక్షత వల్ల ముందుగానే అమ్మాయి అని తెలుసుకుని వారిని తొలగించాలని భావిస్తుంటారు. ఈ విధంగా అబార్షన్ చేసే వారిపై భారతదేశంలో నేరంగా భావించి పలు కేసులను నమోదు చేయవచ్చు. ఈ విధమైనటువంటి అబార్షన్ లను చేయటం మన దేశంలో చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.24 వారాల తర్వాత ఎటువంటి మహిళలలో అయినా అబార్షన్ జరిగితే వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అబార్షన్ అనేది కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. అలాంటప్పుడే తల్లి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉంటుంది.