కరోనా కారణంగా ప్రతీ ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. సెకండ్ వేవ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నా.. మరీ విపరీతంగా మాత్రం లేవు. వచ్చే నెల నుంచి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు దాని భారి నుంచి రక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా జికా వైరస్ కలవరపెడుతోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. రూరల్ పుణెలోని పురందర్‌లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఐదుగురి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. బెస్లార్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జులై 30వ తేదీన ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.
జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు అని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవాతె అంటున్నారు. బాధితురాలి కుటుంబంలో మరెవరికీ జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ఐతే ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారు. వారిలో కొందరికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. జికా వైరస్ అనేది దోమ కుట్టిన 14 రోజుల తర్వాత బయటపడుతుందని తెలిపారు.
ఎడిస్ ఈజిప్ట్ అనే దోమల జాతి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అందుకే వర్షా కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నామని.. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తామని జిల్లా అధికారి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…