Featured

నాకు చేతబడి చేశారు.. ఆ దేవుడే నన్ను కాపాడాడు : నటి మోహిని

ఆమె ముద్దు పేరు తంజావూరు మహాలక్ష్మి. ప్రతీ ఒక్కరూ ఆమెను అలానే పిలిచేవారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె పేరు మోహినిలా.. ప్రస్తుతం క్రిస్టియానాగా పేరుగా మారిపోయింది. ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. తెలుగులో బాలకృష్ణ క్లాసిక్ చిత్రం ఆదిత్య 369లో హీరోయిన్‌గా మోహిని నటించి అదరగొట్టారు.

తర్వాత మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్‌ నారద’లో నటించారు. వివిధ భాషల్లో వందకు పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మోహిని కోట్ల మంది హిందువులకు గురువైన రమణ మహర్షికి వరసకు మనమరాలిగా కూడా నటించింది. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని ప్రస్తుతం క్రైస్తవ మతాభిమాని కూడా. దాదాపు 100పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషాయలను తెలియజేశారు.

తనకు చేతబడి చేశారని .. తనను ఏసు ప్రభు దేవుడు కాపాడినట్లుగా చెప్పుకొచ్చారు. తనకు పెళ్లి అయిన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపింది. కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నానో నాకే తెలిసేది కాదన్నారు. రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశాను అని తెలిపింది. దీనితో ఒక జ్యోతిష్కుడికి చూపించగా.. ఆయన తనకు కొందరు చేతబడి చేశారని చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అనేక పూజలు ప్రార్థనలు తర్వాత ఏసుస్వామే నా దేవుడని నమ్మానని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత మానసిక సమస్యల నుంచి బయటపడ్డట్లు తెలిపింది. ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. అందరం కలిసి గుడికి వెళ్లేవాళ్లం.. మడి ఆచారాలు కూడా పాటించేవాళ్లమని చెప్పింది. .

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago