తెలుగు రియాల్టీ షో లల్లో ఎక్కువగా పాలపులర్ తెచ్చుకున్న తెలుగు ప్రోగ్రాం బిగ్ బాస్. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు ఐదవ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈసారి కాస్త గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. NTR తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది.
చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్ కు రానా పేరు తొలుత వినపడినా, తాను ‘బిగ్ బాస్’ షో చేయడంలేదని ఆయనే ఖండించడంతో ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ముచ్చటగా మూడోసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ షో ను నిర్వహిస్తారనే అనిపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. నాలుగో సీజన్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే విషయాలు ముందుగానే తెలిసేవి.
ఈ సారి మాత్రం అలాంటి లీకులకు అవకాశం లేకుండా ముందస్తు జగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన మరో బిగ్ అప్ డేట్ ఏమిటంటే… ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలువుతుందని తెలుస్తోంది. టెలికాస్ట్ కు దాదాపు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ పనులూ శరవేగంగా సాగుతున్నాయట. ఇదిలా ఉండగా.. ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ లిస్ట్ లో యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక మంగ్లీ బిగ్‌బాస్ సెట్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదట.. బోనాల సందర్బంగా ఆమె పాడినపాట వివాదాలకు తావివ్వడంతో బిగ్‌బాస్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట.. అయితే నిర్వాహకులు మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించి, షోకి తీసుకురావాలని షో భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…