కొత్త కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే ఆన్‌లైన్ ఆటోమొబైల్ క్లాసిఫైడ్స్ సంస్థ కార్ ట్రేడ్ టెక్ ఆగస్టు 9న IPOకి రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా ఈ కంపెనీ రూ.2,000 కోట్లు రాబట్టాలని భావిస్తోంది. దీనికి అమెరికా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయిన వార్‌బర్గ్ పింకస్ పెట్టుబడులు భారీగానే ఉన్నాయి.
అంతే కాకుండా ఇందులో సింగపూర్ ప్రభుత్వ రంగ కంపెనీ టెమాసెక్, జేపీ మోర్గాన్, మార్చ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీ ఆదాయం గత రెండు సంవత్సరాల నుంచి బాగున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 318.44 కోట్లు ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో దీని ఆదాయం రూ.281.52 కోట్లు ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం కంటే గతేడాది దీని ఆదాయం రూ. 31 కోట్లకు పైగా లాభం పొందింది. దీనిలో ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు రూ. 1.85 కోట్ల షేర్లను అమ్మబోతున్నారు. పూర్తిగా ఇది సేల్ ఆధారితంగా ఉంది. దీనికి సంబంధించి ఐపీఓ ఇన్వెస్ట్ మెంట్ అనేది.. బ్యాంకర్ల కింద ఉండబోతున్నాయి. దీనిని 2009 లో ప్రారంభించారు. దీని స్థాపకుడు మరియు సీఈఓ వినయ్ సంఘీ.
ఆయన 2000 నుంచి 2009 వరకు మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్‌కి సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లు తమ పాత కార్లను అమ్ముకోవచ్చు. కొత్త కార్లను కొనుక్కోవచ్చు.ఇది అన్ని రకాల వాహనాలనూ కవర్ చేస్తుంది. వాల్యూ యాడెడ్ సర్వీసులు అందిస్తుంది. దీనిలో ముఖ్యంగా అక్రియోట్ ఆటో, అటోబిజ్, కార్ వాలే, కార్ ట్రేడ్, శ్రీరామ్ ఆటోమాల్, బైక్ వాలే, కార్ ట్రేడ్ ఎక్స్‌ఛేంజ్ ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…