ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా చాలామందికి వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం ( Hair Fall). ఇలా జుట్టు రాలుతూ ఉంటే ఓ రోజు బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది. కొంత మందికి చిన్న వయస్సులోనే జట్టు రాలుతుంటుంది. ఇలా జుట్టు రాలిపోకుండా ఇప్పటికే చాలా రకరకాల ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు.
అసలు ఇలా బట్టతల రావడానికి గల కారణం ఏంటి.. జట్టు రాలిపోకుండా ఉంటాలంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. బట్టతల అనేది ముఖ్యంగా శరీరంలోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా వస్తుంది. వెట్రుకలు రాలిపోవడానికి ప్రధాన కారణం మనిషి తీవ్ర ఒత్తిడితో ఉండటం, పోషకాహార లోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.
బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం కానీ.. బట్టతల రాకుండా కొన్నాళ్ల పాటు మనం దానికి బ్రేక్ వేసే చాన్స్ మాత్రం ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కంటినిండా నిద్ర పోవాలి అంతే కాకుండా ప్రతీ రోజు వ్యాయామం చేయడం వల్ల కూడా జుట్టు రాలడం ఆగిపోతుంది. మద్యపానం, ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భయటకు వెళ్తే మాత్రం మూతికి మాస్క్ పెట్టుకుంటున్నట్లే తలకు కూడా స్కార్ఫ్ లేదా క్యాప్ ధరించి వెళ్తే దుమ్మూ, ధూళి పడకుండా ఉంటుంది. దుమ్ముతో ఎక్కువగా చుండ్రు తయారవుతుంది.
దీని వల్ల కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా ఉటుంది. పురుషులు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు నుంచి మూడు సార్లు తల స్నానం చేస్తే మంచింది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శిరోజాల సంరక్షణలోనూ ఇవి దోహదపడతాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని నిద్రపోయేముందు నెత్తికి పట్టించి.. పొద్దున్నే తలస్నానం చేస్తుండాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా పైన చెప్పిన విధంగా చిట్కాలు అనుసరించితే జుట్టు రాలడం ఆగిపోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…