గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరల్ని పెంచాయి. ఏకంగా రూ. 73.50 పెరిగింది. కానీ ఇంత పెరిగినా సామాన్యులకు మాత్రం ఊరట లభించింది. అదెలా అంటే.. ఆగస్ట్ 1న కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించిన కంపెనీలు.. కమర్షియల్ సిలిండర్ ధర కొనేవారికి వారికి మాత్రమే షాక్ ఇచ్చాయి.
కమర్షియల్ సిలిండర్‌ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వ్యాపారులకు షాక్ తగిలినట్టు అయింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. ఇప్పుడు రూ.73.50 పెరిగింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.157.50 పైనే పెరగడంతో వ్యాపారులపై భారీగా భారం పడనుంది.
ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.1800 కు పైగా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. సబ్సిడీ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. దీనికి పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.887 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు చెన్నైలో రూ.1,761, కోల్‌కతాలో రూ.1,623, ముంబైలో రూ.1,579.50 గా ఉంది. ప్రతీ నెల మొదటి తేదీన ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడమో.. తగ్గించమో చేస్తుంటాయి. అంటే ఉన్న ధరలను సవరిస్తుంటాయి. ఈ ధరలు అనేవి అతర్జాతీయ మర్కెట్ పై ఆధారపడి ఉంటాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…