మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఏకంగా రూ.73.50 పెరిగాయి.. కానీ సామాన్యుడికి మాత్రం ఊరట.!

0
75

గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరల్ని పెంచాయి. ఏకంగా రూ. 73.50 పెరిగింది. కానీ ఇంత పెరిగినా సామాన్యులకు మాత్రం ఊరట లభించింది. అదెలా అంటే.. ఆగస్ట్ 1న కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించిన కంపెనీలు.. కమర్షియల్ సిలిండర్ ధర కొనేవారికి వారికి మాత్రమే షాక్ ఇచ్చాయి.

కమర్షియల్ సిలిండర్‌ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వ్యాపారులకు షాక్ తగిలినట్టు అయింది. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 పెరిగింది. ఇప్పుడు రూ.73.50 పెరిగింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.157.50 పైనే పెరగడంతో వ్యాపారులపై భారీగా భారం పడనుంది.

ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర హైదరాబాద్ లో రూ.1800 కు పైగా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. సబ్సిడీ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. దీనికి పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.887 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధరలు చెన్నైలో రూ.1,761, కోల్‌కతాలో రూ.1,623, ముంబైలో రూ.1,579.50 గా ఉంది. ప్రతీ నెల మొదటి తేదీన ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడమో.. తగ్గించమో చేస్తుంటాయి. అంటే ఉన్న ధరలను సవరిస్తుంటాయి. ఈ ధరలు అనేవి అతర్జాతీయ మర్కెట్ పై ఆధారపడి ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here