నటిగా పలు సినిమాలలో సందడి చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంటరైన నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక నటనకు స్వస్తి చెప్పిన ఈ నటి బిజెపి పార్టీలో చేరిన ఈ నటి పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఈ క్రమంలోనే గతంలోఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపికి ఓటు వేయాలని ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించింది.
ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న మాధవి పై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే బండి పై ర్యాలీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలో మాధవి బండి నడుపుతున్న సమయంలో తన అసిస్టెంట్ తనకు ప్రొటెక్షన్ కల్పించడానికి బండిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేయడంతో ఈ విషయం కాస్తా వివాదంగా మారింది.
సదరు ఫోటో పై స్పందించిన నెటిజన్ పక్కనోడి దొరికినకాడ నొక్కేస్తున్నాడుగా.. అంటూ కామెంట్ చేయగా సదరు నెటిజన్ పై నటి మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాధవి స్పందిస్తూ… “చెత్త వెదవలు.. చెత్త బుద్ధి.. చెత్త కళ్ళు అతను నా అసిస్టెంట్ ఇడియట్. నీ లాంటోళ్లుకదరా సినీ తారలు కనిపిస్తే అలా చేస్తారు అందుకే అదేబుద్ధి నీకు ఉంది అంటూ ఘాటుగా స్పందించారు.
ఈ విధంగా నటి మాధవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువురు కార్యకర్తలు తనకు మద్దతుగా నిలిచారు. మనం చేసే మంచి పనులకు ఎన్నో అడ్డంకులు వస్తాయి అయినా వాటన్నింటికీ సమాధానం చెబుతూ వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ విధంగా ముక్కుసూటితనంగా వ్యవహరించే మాధవి లత తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు గట్టిగానే స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెబుతుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…