ఆ రోజు నుంచే బిగ్ బాస్ తెలుగు 5 ప్రోగ్రాం స్టార్ట్..! కంటెస్టెంట్ లిస్ట్ రెడీ చేసిన నిర్వాహకులు..!

0
1069

తెలుగు రియాల్టీ షో లల్లో ఎక్కువగా పాలపులర్ తెచ్చుకున్న తెలుగు ప్రోగ్రాం బిగ్ బాస్. గత నాలుగు సీజన్స్ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా వీక్షకులలో కుతూహలాన్ని పెంచుతూ పోయాయి. ఇప్పుడు ఐదవ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో గత సీజన్స్ టీఆర్పీని క్రాస్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈసారి కాస్త గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. NTR తో మొదలై, నాని చేతుల మీదుగా నాగార్జున భుజస్కందాలపైకి బిగ్ బాస్ షో చేరింది.

చివరి మూడు, నాలుగు సీజన్స్ ను కింగ్ నాగార్జునే సమర్థవంతంగా నడిపారు. ఇప్పుడీ ఐదో సీజన్ కు రానా పేరు తొలుత వినపడినా, తాను ‘బిగ్ బాస్’ షో చేయడంలేదని ఆయనే ఖండించడంతో ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే ముచ్చటగా మూడోసారి కూడా నాగార్జునే బిగ్ బాస్ షో ను నిర్వహిస్తారనే అనిపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సివుంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. నాలుగో సీజన్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే విషయాలు ముందుగానే తెలిసేవి.

ఈ సారి మాత్రం అలాంటి లీకులకు అవకాశం లేకుండా ముందస్తు జగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే బిగ్ బాస్ సీజన్ 5కు సంబంధించిన మరో బిగ్ అప్ డేట్ ఏమిటంటే… ఈ సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలువుతుందని తెలుస్తోంది. టెలికాస్ట్ కు దాదాపు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ పనులూ శరవేగంగా సాగుతున్నాయట. ఇదిలా ఉండగా.. ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ లిస్ట్ లో యాంకర్‌ రవి, యాంకర్‌ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక మంగ్లీ బిగ్‌బాస్‌ సెట్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదట.. బోనాల సందర్బంగా ఆమె పాడినపాట వివాదాలకు తావివ్వడంతో బిగ్‌బాస్‌ వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట.. అయితే నిర్వాహకులు మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించి, షోకి తీసుకురావాలని షో భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here