Tag Archives: premi vishwanath

Serial Actress: ఈ సీనియర్ నటీమణుల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Serial Actress: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ లకు ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి.ఇలా బుల్లితెరపై సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఒక్క చానల్లోనూ ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇలా సీరియల్స్ ద్వారా సీరియల్ నటిమణులు కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా వీరి క్రేజ్ చూసి వీరి రెమ్యూనరేషన్లు కూడా అదే స్థాయిలోనే అందుకుంటున్నారని చెప్పాలి.

ఇక ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సీరియల్ ఏంటి అంటే టక్కున అందరూ కూడా కార్తీకదీపం సీరియల్ అని చెబుతారు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్.ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో పుచ్చుకుంటున్నారు.

ఈమె ఒక రోజు షూటింగ్ లొకేషన్లో ఉండాలి అంటే తప్పనిసరిగా 30 వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఈమెతో పాటు కస్తూరి, నవ్య స్వామి, మేఘన లోకేష్, సుజిత వంటి సెలబ్రిటీలు కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇక వీరందరూ కూడా ఒక్క కాల్ షీట్ కోసం సుమారు 25వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Serial Artists: వామ్మో…ఈ సీరియల్ హీరోయిన్స్ రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Serial Actress:భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటీమణులు…

ఇక అర్చన అనంత్,అనిలా శ్రీకుమార్, శోభా శెట్టి లాంటివారు ఒక్కరోజు కాల్షీటుకు​ రూ.15 వేల రెమ్యూనరేషన్​ను తీసుకుంటున్నారట.ఇలా బుల్లితెరపై ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలో రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నారని చెప్పాలి. ఇక ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ పూర్తి కావడంతో ఎంతోమంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Vantalakka: డాక్టర్ బాబు ఇంట్లో సందడి చేసిన వంటలక్క.. చీర సారే పెట్టిన మంజుల నిరుపమ్!

Vantalakka: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సీరియల్స్ ద్వారా పరిటాల నిరుపమ్(డాక్టర్ బాబు) ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ లోవీరిద్దరూ కార్తీక్ దీప పాత్రలలో నటించినప్పటికీ వీరిద్దరూ మాత్రం డాక్టర్ బాబు వంటలక్కగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే తాజాగా వంటలక్క డాక్టర్ బాబు ఇంటికి వెళ్లి పెద్ద ఎత్తున సందడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సీరియల్ గత ఆరు సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్నప్పటికీ డాక్టర్ బాబు తనని ఇంటికి ఆహ్వానించలేదని వంటలక్క తెలియజేశారు. ఇకపోతే మార్నింగ్ షూటింగ్ కి వచ్చి ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోతారని డాక్టర్ బాబు చెప్పుకొచ్చారు.

కార్తీక్ ఇంట్లో సందడి చేసిన దీపకు మంజుల తన కుమారుడు రిక్కి వేసిన పెయింటింగ్స్ మొత్తం చూపించారు. అలాగే డాక్టర్ బాబు తల్లి దీపతో ఎంతో సరదాగా మాట్లాడారు. ఇక కార్తీక్ తన ఇంటిని మొత్తం వంటలక్కకి చూపించారు. ఇక వంటలక్కను ఆహ్వానించడంతో ప్రత్యేకమైన భోజనాలను ఏర్పాటు చేశారు.

Vantalakka: డాక్టర్ బాబు ఇంట్లో వంటలక్క…


ఇక అందరూ కలిసి సరదాగా భోజనం చేయడమే కాకుండా వంటలక్క డాక్టర్ బాబు ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. వంటలక్క డాక్టర్ బాబు మంజుల కోసం ప్రత్యేకంగా గిఫ్టులు కూడా తీసుకువచ్చారు. ఇక దీప వెళ్లే సమయానికి డాక్టర్ బాబు భార్య మంజుల తనకు సాంప్రదాయ బద్ధంగా చీర సారే పెట్టి పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షాకింగ్ ట్విస్ట్.. హిమను చంపింది నేనే.. కనిపించే పిశాచి ఆ మోనిత!

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. గత ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి అంజిను వెతుకుతూ వెళ్తారు. చివరికి మోనిత అంజి ఉంటున్న హోటల్ కి వెళ్లి తను మారిపోయానని అంజితో చెబుతుంది. అయినప్పటికీ అంజి నమకపోవడంతో తన విశ్వరూపం బయటపడుతుంది. ఇక నేడు కార్తీకదీపం సీరియల్ 110 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈ రోజు హైలెట్స్ ఏమిటో తెలుసుకుందాం…

హోటల్ గదిలో అంజి మోనిత మాట్లాడుతూ ఉండగా దీపమ్మకు ఏమైనాచేసావో అనిఅంటుండగా..మూయరా రాస్కెల్.. ఎవతి రా.. దీప అదే మైనస్ నీ అక్క, నీ చెల్లా… అందరూ దీప భజన చేస్తారు. ఏం పెట్టింది రా..అది నీకు ఇంత పచ్చడి మెతుకులు అయినా వండి పెట్టింది రా.. .ఇదేమి విశ్వాసం రా కుక్కకున్నట్టు నేను ఎంత డబ్బు ఇచ్చాను. అదంతా వదిలేసి వదిలేసి దీపమ్మ.. దీపమ్మ అంటారు ఏంటిరా ఛీ.. దీనమ్మ జీవితం. దాని మొగుడు వదిలేస్తే జరిగినప్పుడు నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే కార్తీక కాలర్ పట్టుకొని హిమను చంపింది నేనేనని ధైర్యంగా ఎందుకు చెప్పలేదు. మీరంతా మంచివాళ్లే అని కార్తీక్ నమ్మితే.. నేను ఎందుకు ఇన్ని ఆట ఆడతాను ఛీ.. ఏం బతుకు రా మీది మంచి పేరు తెచ్చుకుని ఏం సాధిస్తున్నారా.. మీరందరూ అంటూ అంజితో గొడవ పడుతుంది. ఇదంతా కిటికీలోనుంచి దీప ఫోన్ లో రికార్డు చేస్తూ ఉంటుంది.

నీ జీవితంలో ఎన్ని రోజులకు ఒకే ఒక మంచి పని చేశావు ఒకే కారులో కార్తీక్ హిమ ఉన్నప్పటికీ హిమను మాత్రమే చంపి కార్తీక్ చనిపోకుండా యాక్సిడెంట్ మాత్రమే బాగా చేశావంటూ అంటుంది. అదొక్కటే నువ్వు నాకు చేసిన ఫేవర్. అయినా చంపించిన నేను ఎంత నేరస్తురాలో చంపిన నువ్వు కూడా అంతే నేరస్తుడు. నువ్వు ఏదో పవిత్రమూర్తి అన్నట్టూ మాట్లాడుతున్నావ్ ఏంటి రా. చూడు నువ్వు ఎంత క్రూరమైనవాడో నేను కూడా అంతే.. కాబట్టి మనం మనం గొడవ పడడం అనవసరం. నువ్వు నాతో వస్తావా.. రావా అని అడుగుతుంది. నాకు నిద్ర వస్తుంది. రేపే నా పెళ్లి.. నిద్రపోకపోతే నా గ్లామర్ దెబ్బతింటుంది. రా నాతో రా అంటూ అంజి చేయి పట్టుకోగా ఇప్పుడు జుట్టు అందిందా.. అంటూ అంజి మాట్లాడుతాడు.

ఇందాక కాళ్లు పట్టుకున్నావా… నువ్వు ఎంత నటన చేసిన నేను నమ్మలేదు. ఎందుకు ఇందుకే.. నువ్వు ఎక్కువ సేపు నటించలేవే. నీ లోనుంచి నీ ఒరిజినల్ పిశాచి వెంటనే బయటకు వస్తుంది నీతో నేను వచ్చేది..నిన్ను ఇప్పుడే లాక్కెళ్లి డాక్టర్ బాబు ..దీప ముందు పడేసి అంటూ మోనితను లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మోనిత గన్ను తీసి అంజికి గురి పెడుతుంది. గన్ను గురు పెడుతూ దీపమ్మ.. దీపమ్మ భజన చేస్తావు కదా..నీ దీపమ్మ కోసం నీ దీపాన్ని ఆరుపుకో అంటూ అంజిని బెదిరిస్తుంది. దీపమ్మకోసం చచ్చిపో… నేను కార్తిక్ ని వదలడం ఏంటిరా.. అది ఈ జన్మలో జరగదు.

మా పెళ్ళికి నీ పేరును అడ్డు పెట్టి నా పెళ్లి ఆపాలని చూస్తుంది దీప. నా పెళ్లికి ముందు నిన్ను చంపి ఆ కేసు నా మెడకు చుట్టుకుని నా మెడలు మూడుముళ్ళు పడకుండా ఆగిపోతుందని నేను ఆగిపోతున్నాను. కానీ అడ్డు తిరిగితే మాత్రం. నిన్ను ఇప్పుడే ఇక్కడే తూట్లు తూట్లు పడేలా కాల్చిపారేస్తా అని బెదిరిస్తుంది. అప్పుడు అంజి మాట్లాడుతూ.. ఎంత తెలివి నీకు నావల్ల ప్రమాదముందని నన్ను వెతుక్కుంటూ వచ్చావా.. అంటే దీపమ్మ వల్ల ఏదైనా ప్రమాదం ఉందని ఆమెను కూడా ఏమైనా చేసావా అని అంజి అంటాడు.

అప్పుడు మోనిత అవన్నీ నీకు అనవసరం. ఎవరిని ఎప్పుడు ఎలా అడ్డు తప్పించాలో నాకు బాగా తెలుసు. హిమను నీతో ఎలాగైతే చంపించానో నిన్ను కూడా వేరే వాళ్ళతో అలాగే చంపిస్తా. ఇప్పుడు నిన్ని బలివ్వడానికి వచ్చాను. రేయ్.. ద్రాక్షారామం అంటూ ఒక వ్యక్తిని పిలుస్తుంది. రారా.. వీన్ని తాళ్లతో కట్టి డిక్కీలో పడేయి. నేను చెప్పే వరకు వీడిని ప్రాణాలతోనే ఉంచు అంటూ ద్రాక్షారామం కి చెబుతుంది… అప్పుడే దీప అక్కడ ఉన్న విషయం గమనించిన అంజి కాస్త ధైర్యంతో ఉంటాడు. అప్పుడు మోనిత ఏరా గొంతు మూగబోయిందని అంటుంది. రివాల్వర్ తగలగానే ప్రాణాలపై ఆశ పుట్టిందా… పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది వీడికి అంటూ అంజనీ అక్కడినుంచి తీసుకువెళుతుంది.

ఇక కార్తీక దీప గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండగా.. వారణాసి అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని అడుగుతాడు. ఈ టైంలో రమ్మని ఫోన్ చేశారు అంటూ కంగారు పడతాడు. ఎవరికీ ఏమైంది అని అడగగా ఎవరికీ ఏం కాలేదు.. నువ్వు టెన్షన్ పడకుండా ముందు ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ బాటిల్ ఇస్తాడు.నీళ్లు తాగిన తర్వాత వారణాసి చెప్పండి డాక్టర్ బాబు ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు.. దీపకి నువ్వు తోడబుట్టిన తమ్ముడు కన్నా ఎక్కువ. కష్టాల్లో నువ్వు తనకు తోడుగా ఉన్నావు. ఏ కష్టమొచ్చినా నీతో చెప్పేది మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో చెప్పు అంటూ వారణాసి ను అడుగుతాడు.

మీతో చెప్పలేదా అంటూ వారణాసి అడగగా… నాతో చెప్పిన చోటకి వెళ్ళలేదు అందుకే నిన్ను అడుగుతున్నా అంటూ చెబుతాడు. నాకు కూడా తెలియదు. అక్క నిజంగా ఎక్కడికి వెళ్ళిందో.. అడిగితే వచ్చాక చెబుతా లేరా అంటూ వెళ్ళింది అని వారణాసి చెప్పగా నమ్మాలా… అంటూ డాక్టర్ బాబు అంటాడు ఒట్టు బాబు నాకు నిజంగానే తెలియదు..ఈవేళలో ఒక్కటే వెళ్లి ప్రమాదం తెచ్చుకుంటుందని భయం వేస్తుంది తెలిస్తే నిజం చెప్పురా అంటూ బతిమాలాడు. అప్పటికి వారణాసి తెలియదని చెబుతాడు.ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉందా అని అడగగా ఉంది అంటే వెంటనే ఫోన్ చేసి అడుగు ఎక్కడ ఉందో అని చెబుతాడు. వారణాసి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో వారణాసి అక్కడినుంచి వెళ్ళమంటాడు.

కట్ చేస్తే దీప తిరిగి హైదరాబాద్ వస్తుంది.కారులో వస్తూ మోనిత హిమకు యాక్సిడెంట్ చేసిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. అప్పుడు డ్రైవర్ వెంకట్ ఏంటి అక్క.. కారెక్కినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావ్ ..అని అడగగా ఏంలేదులేరా అంటూ దీప సమాధానం చెబుతుంది. ఏంటో అక్క ఫస్ట్ విజయవాడ వెళ్దాం అన్నావ్ తరువాత.. ఆవిడ ఎక్కింది. ఆవిడ సూర్యాపేటలో దిగగానే నువ్వు కూడా నా ఫోను తీసుకెళ్లి అదే హోటల్ కి వెళ్లావు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అక్క అంటూ వెంకట్ అనగా…నాక్కూడా ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదురా అంటూ సమాధానం చెబుతుంది.సరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు డాక్టర్ బాబు కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ చేస్తాను అంటే స్విచ్ ఆఫ్ అయింది అక్క.. కంగారులో రావడంతో చార్జర్ తెచ్చుకోవడం మర్చి పోయాను అంటూ సమాధానం చెప్తాడు.

ఇక తెల్లవారగానే ఉదయం ఇంటికి వెళ్ళిన మోనిత ప్రియమణి గీజర్ ఆన్ చెయ్ అని చెబుతుంది. చేశానమ్మ అంటూ రాత్రి కార్తీక్ బాబు వచ్చాడని చెప్పగానే మోనిత కంగారు పడుతుంది ఎందుకు వచ్చాడని అడగగా తెలియదమ్మా మిమ్మల్ని అడిగారు లేదని చెప్పగానే వెళ్ళిపోయాడు అని సమాధానం చెబుతుంది. మీ జీవితం చేజారి పోకుండా చూసుకోండి అని ప్రియమణి అని వెళ్లగా మోనిత కంగారు పడుతుంది.అంతా నాకు అనుకూలంగానే ఉందనుకున్నాను కానీ ఏదో అపశృతి దొరుకుతుంది. కార్తిక్ ఎందుకు వచ్చాడని ఆలోచిస్తుంది.మరోవైపు కార్తిక్ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలు లేచేలోగా వస్తానని ఇంకా రాలేదు ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక దీప ఇంటికి రావడంతో కార్తీక్ ఎక్కడికి వెళ్ళావ్ అంటూ ప్రశ్నిస్తాడు.

మీ పిన్ని ఇంటికి అని చెప్పి వెళ్ళావ్.. ఆమె ఫోన్ చేసి దీప ఉందా అని అడిగింది.అసలు ఎక్కడికి వెళ్ళావ్ చెప్పకుండా. మీ పిన్ని ఇంటికి వెళ్లకుండా ఫోన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్లావోనని రాత్రంతా నీకోసం పిచ్చోడిలా రోడ్లపై తిరుగుతున్నా అంటూ దీపను ప్రశ్నిస్తాడు అసలేం జరిగింది ఎక్కడికి వెళ్లావు అని అడగగా…బ్రష్ చేసి రండి డాక్టర్ బాబు వేడిగా కాఫీ తాగుతూ మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్తుంది.అదేవిధంగా భాగ్యం ఎలాగైనా పెళ్లి ఆపాలని మోనితను కిడ్నాప్ చేయాలని తన ఇంటికి వెళ్లి కథలు చెబుతుంది. రాత్రి నుంచి అంజి కార్తీక్ దగ్గరే ఉన్నాడు అని చెప్పడంతో ఆమె ఏదో ప్లాన్ చేసిందని పసిగట్టిన మోనిత తనకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

కార్తీకదీపం సీరియల్ లో… కార్తీక దీప ఎప్పుడు కలుస్తారో చెప్పేసిన డైరెక్టర్..?

బుల్లితెరపై టాప్ రేటింగ్ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు తీవ్ర ఉత్కంఠతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ లో దీపకు కార్తీక్ పెట్టే టార్చర్ చూడలేక అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ కు ఓరేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఎన్నో సినిమాలకు,సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాని గుర్తింపు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారికి కార్తీకదీపం బాగా పేరు తెచ్చి పెట్టింది. కొంతమంది అభిమానులు ఈ సీరియల్ ఇంకా ఎన్ని రోజులు సాగ దీస్తారుఅంటూ తిడుతున్నప్పటికీ.. ఈ సీరియల్ సాగదీయడం ప్రేక్షకుల కోసమే అంటూ సమాధానం చెప్పారు.

అన్ని సీరియల్స్ లో మాదిరిగానే ఈ సీరియల్లో కూడా దీప కార్తీక్ ను కలిపేస్తే కథ రోటీన్ గానే ఉంటుంది. అందుకోసమే ఈ సీరియల్ ను సాగదీస్తున్నామని ఈ సీరియల్ సాగదీసే క్రమంలో బోర్ కొట్టినప్పుడు ఇందులో ట్విస్టులు పెడుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులు ఈ సీరియల్ అయిపోవాలని కోరుకోవడం లేదు… ఈ సీరియల్ లో కార్తీక దీపం ఎప్పుడు కలుస్తారు? మోనిత నిజం ఎప్పుడు బయట పడుతుందని మాత్రమే ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు చూస్తుంటే.. కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలాలేదని తెలుస్తోంది.అదేవిధంగా దీపా, కార్తీక్ ఇప్పుడే కలవరనీ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సీరియల్ కు శుభంకార్డు పడితే జనాలు ఏం చేస్తారని.. అందుకోసమే ఈ కథను సాగదీస్తున్నట్లు తెలిపాడు.ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ కథలో ఇంకెన్ని ట్విస్ట్ లను మనం చూడాల్సి వస్తుందోనని అభిమానులు భావిస్తున్నారు.

రోషిణి ఇగోని హర్ట్ చేసిన వంటలక్క.. రగిలిపోయిన ఏసీపీ..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జూలై 20వ తేదీ)1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో వంటలక్క రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత, అంజి గురించి చెబుతుంది. ఈ క్రమంలోనే అంజి ద్వారా మోనిత చేసిన తప్పులను రోషిణికి చెబుతుంది. ఇది అంతా విన్న రోషిణి ఇప్పుడు అంజి ఎక్కడున్నాడు? అని అడగడంతో తెలియదు మేడమ్ అని సమాధానం చెబుతుంది. ఈ మాటలు విన్న రోషిణి ఈ కేసు కడుపు నుంచి క్రైమ్ దాకా వెళ్ళింది. నేను ఆరాతీస్తాను అని చెప్పడంతో దీప అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తూ.. వెళ్తూ వెనక్కి తిరిగి”ఒక్క మాట మేడమ్..ఆ మోనిత మీకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను మీకు ఇంత వివరణ ఇస్తున్నాను, లేకపోతే ఎవరి అవసరం లేకుండా ఆ మోనిత చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకుని దాన్ని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక కట్ చేస్తే భాగ్యం దీపా ఇంటికి వెళ్లి పిల్లలకు పాయసం పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప అది చూసి పిన్నిలో ఎంత మార్పు అంటూ చిన్నప్పుడు తనకి పెట్టిన కష్టాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత పిల్లలకు పాయసం పెట్టి వారిద్దరు మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తారు. ఇక మోనిత చేతి కట్టు చూసుకుంటూ.. దీప అంజి గుర్తున్నాడా! దుర్గా గుర్తున్నాడా? అంటూ ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుంటూ కంగారు పడుతుంది. ఒక వేళ వీళ్లు కనుక దొరికితే నేను చేసిన తప్పులు అన్ని బయటపడతాయి. నాకు శిక్ష తప్పదు ఎలాగైనా జరగబోయే ప్రమాదాన్ని ఆపాలంటూ కంగారు పడుతుంది. అప్పుడే ప్రియమణి ఎంటరై మీరు కడుపుతో ఉన్నారమ్మ…ఇలా టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో కార్తీక్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు విశ్రాంతి అంటూ అంత వరకు నాకు రెస్ట్ అనేది లేదు అంటూ గట్టిగా అరవడంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక రోషిణి దీప అన్న మాటలను గుర్తు చేసుకొని ఎంతమాట అంది,కంప్లైంట్ ఉంది కాబట్టి వివరణ ఇస్తుందట.. లేకపోతే నువ్వెంత అని నన్ను అన్నట్లుగా అంటూ మనసులో అనుకుంటుంది. ఈ విధంగా దీప గురించి ఆలోచిస్తూ.. ఇన్ని రోజులు నా సర్వీస్ లో నాతో ఈ విధంగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. ఇది దీపలో ఉన్న కాన్ఫిడెన్సా.. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా..ఈ విధంగా దీపా అన్న మాటలకు ఎంతో అవమాన పడుతున్న రోషిని అందులో నుంచి తేరుకుని ఈ కేస్ చాలా టిపికల్, నా ఇగోని పక్కనపెట్టి ఈ కేసును ఎంతో ప్రొఫెషనల్గా ఆలోచించాలి అంటూ… ఎవరికో ఫోన్ చేసి అంజి గురించి వివరాలను తెలుపుతుంది.

ఇక తన స్నేహితులు కొడుకును కలవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినా ఆనందరావుకు అక్కడ 25వ తేదీ మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకుంటారనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు దీప ఇంటికి చేరుకొని మోనితని చేసుకొని ఆమె ఇంటికి వెళ్తావా… లేక ఆమెని ఇంటికి తీసుకు వస్తావా.. బ్లడీ ఫూల్ అంటూ కార్తీక్ ను తిడతాడు. ఈ ఘోరం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ నిలదీస్తాడు.తన తండ్రి తిడుతుంటే కార్తీక్ మనసులోనే మోనిత ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విధంగా ఆనందరావు తిడుతుంటే కార్తీక్ ఏం చేయాలో తోచక తలదించుకుని నిలబడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.