Featured

రోషిణి ఇగోని హర్ట్ చేసిన వంటలక్క.. రగిలిపోయిన ఏసీపీ..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జూలై 20వ తేదీ)1094 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో వంటలక్క రోషిణి దగ్గరకు వెళ్లి మోనిత, అంజి గురించి చెబుతుంది. ఈ క్రమంలోనే అంజి ద్వారా మోనిత చేసిన తప్పులను రోషిణికి చెబుతుంది. ఇది అంతా విన్న రోషిణి ఇప్పుడు అంజి ఎక్కడున్నాడు? అని అడగడంతో తెలియదు మేడమ్ అని సమాధానం చెబుతుంది. ఈ మాటలు విన్న రోషిణి ఈ కేసు కడుపు నుంచి క్రైమ్ దాకా వెళ్ళింది. నేను ఆరాతీస్తాను అని చెప్పడంతో దీప అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్తూ.. వెళ్తూ వెనక్కి తిరిగి”ఒక్క మాట మేడమ్..ఆ మోనిత మీకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నేను మీకు ఇంత వివరణ ఇస్తున్నాను, లేకపోతే ఎవరి అవసరం లేకుండా ఆ మోనిత చేస్తున్న కుట్ర ఏంటో తెలుసుకుని దాన్ని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక కట్ చేస్తే భాగ్యం దీపా ఇంటికి వెళ్లి పిల్లలకు పాయసం పెడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దీప అది చూసి పిన్నిలో ఎంత మార్పు అంటూ చిన్నప్పుడు తనకి పెట్టిన కష్టాలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత పిల్లలకు పాయసం పెట్టి వారిద్దరు మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తారు. ఇక మోనిత చేతి కట్టు చూసుకుంటూ.. దీప అంజి గుర్తున్నాడా! దుర్గా గుర్తున్నాడా? అంటూ ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకుంటూ కంగారు పడుతుంది. ఒక వేళ వీళ్లు కనుక దొరికితే నేను చేసిన తప్పులు అన్ని బయటపడతాయి. నాకు శిక్ష తప్పదు ఎలాగైనా జరగబోయే ప్రమాదాన్ని ఆపాలంటూ కంగారు పడుతుంది. అప్పుడే ప్రియమణి ఎంటరై మీరు కడుపుతో ఉన్నారమ్మ…ఇలా టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంతో కార్తీక్ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నాకు విశ్రాంతి అంటూ అంత వరకు నాకు రెస్ట్ అనేది లేదు అంటూ గట్టిగా అరవడంతో ప్రియమణి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ఇక రోషిణి దీప అన్న మాటలను గుర్తు చేసుకొని ఎంతమాట అంది,కంప్లైంట్ ఉంది కాబట్టి వివరణ ఇస్తుందట.. లేకపోతే నువ్వెంత అని నన్ను అన్నట్లుగా అంటూ మనసులో అనుకుంటుంది. ఈ విధంగా దీప గురించి ఆలోచిస్తూ.. ఇన్ని రోజులు నా సర్వీస్ లో నాతో ఈ విధంగా మాట్లాడిన వారు ఎవరూ లేరు. ఇది దీపలో ఉన్న కాన్ఫిడెన్సా.. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా..ఈ విధంగా దీపా అన్న మాటలకు ఎంతో అవమాన పడుతున్న రోషిని అందులో నుంచి తేరుకుని ఈ కేస్ చాలా టిపికల్, నా ఇగోని పక్కనపెట్టి ఈ కేసును ఎంతో ప్రొఫెషనల్గా ఆలోచించాలి అంటూ… ఎవరికో ఫోన్ చేసి అంజి గురించి వివరాలను తెలుపుతుంది.

ఇక తన స్నేహితులు కొడుకును కలవడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినా ఆనందరావుకు అక్కడ 25వ తేదీ మోనిత, కార్తీక్ పెళ్లి చేసుకుంటారనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆనందరావు దీప ఇంటికి చేరుకొని మోనితని చేసుకొని ఆమె ఇంటికి వెళ్తావా… లేక ఆమెని ఇంటికి తీసుకు వస్తావా.. బ్లడీ ఫూల్ అంటూ కార్తీక్ ను తిడతాడు. ఈ ఘోరం చూడటానికేనా నా కోడలను బతికించావు అంటూ నిలదీస్తాడు.తన తండ్రి తిడుతుంటే కార్తీక్ మనసులోనే మోనిత ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అనుకుంటాడు. ఈ విధంగా ఆనందరావు తిడుతుంటే కార్తీక్ ఏం చేయాలో తోచక తలదించుకుని నిలబడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago