Movie News

కార్తీకదీపం సీరియల్ లో… కార్తీక దీప ఎప్పుడు కలుస్తారో చెప్పేసిన డైరెక్టర్..?

బుల్లితెరపై టాప్ రేటింగ్ దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు తీవ్ర ఉత్కంఠతో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారంటే ఈ సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ సీరియల్ లో దీపకు కార్తీక్ పెట్టే టార్చర్ చూడలేక అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ కు ఓరేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఎన్నో సినిమాలకు,సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాని గుర్తింపు డైరెక్టర్ కాపు గంటి రాజేంద్ర గారికి కార్తీకదీపం బాగా పేరు తెచ్చి పెట్టింది. కొంతమంది అభిమానులు ఈ సీరియల్ ఇంకా ఎన్ని రోజులు సాగ దీస్తారుఅంటూ తిడుతున్నప్పటికీ.. ఈ సీరియల్ సాగదీయడం ప్రేక్షకుల కోసమే అంటూ సమాధానం చెప్పారు.

అన్ని సీరియల్స్ లో మాదిరిగానే ఈ సీరియల్లో కూడా దీప కార్తీక్ ను కలిపేస్తే కథ రోటీన్ గానే ఉంటుంది. అందుకోసమే ఈ సీరియల్ ను సాగదీస్తున్నామని ఈ సీరియల్ సాగదీసే క్రమంలో బోర్ కొట్టినప్పుడు ఇందులో ట్విస్టులు పెడుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులు ఈ సీరియల్ అయిపోవాలని కోరుకోవడం లేదు… ఈ సీరియల్ లో కార్తీక దీపం ఎప్పుడు కలుస్తారు? మోనిత నిజం ఎప్పుడు బయట పడుతుందని మాత్రమే ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు చూస్తుంటే.. కార్తీకదీపం సీరియల్ కు ఇప్పుడే ఎండ్ కార్డ్ పడేలాలేదని తెలుస్తోంది.అదేవిధంగా దీపా, కార్తీక్ ఇప్పుడే కలవరనీ డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. అయినా ఈ సీరియల్ కు శుభంకార్డు పడితే జనాలు ఏం చేస్తారని.. అందుకోసమే ఈ కథను సాగదీస్తున్నట్లు తెలిపాడు.ఈ విధంగా డైరెక్టర్ చెప్పిన మాటలు వింటూ ఉంటే ఈ కథలో ఇంకెన్ని ట్విస్ట్ లను మనం చూడాల్సి వస్తుందోనని అభిమానులు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago