బుల్లితెర నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నవ్య స్వామి ఒకరు. ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర పైకి అడుగుపెట్టిన నవ్య స్వామి అతి తక్కువ సమయంలోనే పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నవ్య స్వామి “ఆమె కథ” సీరియల్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈ సీరియల్ లో నటుడు రవికృష్ణతో జోడికట్టి అద్భుతంగా నటించారు.వీరి నటన చూసిన ప్రేక్షకులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని పలు సందర్భాలలో నవ్య స్వామి తెలిపారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో కూడా అభిమానులు భారీగానే ఉన్నారు.
తాజాగా ఓ అభిమాని తమ అభిమాన నటిని ఏకంగా అలనాటి అందాల తారలు సావిత్రి, సౌందర్యతో పోల్చాడు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన మీమ్ ను నవ్య స్వామి తన స్టేటస్ లో పెట్టగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…