Tag Archives: priyaka

Bigg Boss 5 Telugu Manas : ఆ విషయం పింకీ విజ్ఞతకే వదిలేస్తున్నా..ప్రియాంకపై మానస్ సంచలన వ్యాఖ్యలు..!

Manas-Priyanka: బిగ్ బాస్ సీజన్ -5 ముగిసి వారాలు గడుస్తున్నా… ఇంకా ఆడియన్స్ ఆ మానియాలోనే ఉంటున్నారు. బిగ్ బాస్ 5 సీజన్ లో వీజే సన్నీ విజేతగా నిలువగా… ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచారు.

బిగ్ బాస్ లో షన్నూ గెలుస్తాడని అనుకుంటున్నప్పటికీ, సిరితో రొమాన్స్ షన్నూ కొంప ముంచింది. సిరి- షన్నూల ఎపిసోడ్స్ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి. దీంతో పాటు శ్రీరామ్ చంద్ర- హమీదా జోడితో పాటు మానస్- ప్రియాంకల జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో మిస్టర్ కూల్ గా అందరి మన్ననలు పొందింది మాత్రం మానస్.

Manas-Priyanka: ఆ విషయం పింకీ విజ్ఞతకే వదిలేస్తున్నా..ప్రియాంకపై మానస్ సంచలన వ్యాఖ్యలు..!

సన్నీ- మానస్ ల ఫ్రెండ్ షిప్ కూడా షోకు హైలెట్ గా నిలిచాయి. మానస్ తన ఆటతీరుతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు తెగ నచ్చేశాడు మానస్. తన మెచ్యూర్డ్ ఆట తీరుతో అందర్ని ఆకట్టుకున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన మానస్, బిగ్ బాస్ షో ద్వారా మరింత మందికి దగ్గరయ్యాడు. 

Manas-Priyanka: సున్నితంగా నో చెప్పేసిన మానస్..

అయితే మానస్ తో ప్రియాంకతో లవ్ ట్రాక్. మాసస్ పై ఎన్నోసార్లు ఇష్టాన్ని ప్రదర్శించినా..ఎంతో మెచ్యురిటీతో సున్నితంగా నో చెప్పేవాడు. అయితే తాజాగా మానస్, ప్రియాంక గురించి ఓ ఇంటర్య్యూలో షాకింగ్ కామెంట్లు చేశాడు. జైలు నామినేషన్ టాస్కుల్లో అవకాశం ఉన్నా రవిని కాకుండా జెస్సీని నామినేట్ చేసింది. ఆ సందర్భం లో ప్రియాంక నటిస్తున్నట్లు అనిపించింది. అంతకుముందు టవర్ టాస్కులో కూడా చీరను అడ్డుపెట్టి ఓడిపోయేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రియాంక నటిస్తున్నట్లు ఉందని కాజల్ తో చెప్పానని మానస్ అన్నాడు. తను నా ఫ్రెండ్ కాబట్టి అన్నాను. అందరి గురించి అలా చెప్పలేనని మానస్ అన్నారు. హౌజ్ లో 90 రోజులు గడిపాక ప్రియాంక బయటకి వెళ్లింది. ఆ సమయంలో ప్రియాంక ఈ పుటేజీని చూసి నువ్వు నటించావా.. లేదా భరించావా.. అని వీకెండ్ ఎపిసోడ్లో అడిగింది. 24 గంటలు హౌస్లో నన్ను గమనించి కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి అలా అడిగిందంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా’ అన్నాడు మానస్.

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి మద్దతు తెలిపిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి!

తమన్నా సింహాద్రి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన ఈమె సీరియల్ నటుడు రవి కృష్ణతో గొడవ పెట్టుకొని ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే ఈమె ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో నిలబడ లేదనే చెప్పాలి.అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా తమన్నా సింహాద్రి బిగ్ బాస్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి ఈమె ఒక వీడియోని చేస్తూ ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మీడియా చేస్తూ చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. సాధారణంగా ట్రాన్స్జెండర్ అంటే చాలా మందికి రోడ్డుపై వచ్చి పోయే వారిని డబ్బులు అడిగే వాళ్ళుని భావిస్తారు నిజానికి ఎంతో మంది తమ తల్లిదండ్రులకు దూరంగా వచ్చి గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు.

అలా గౌరవంగా బ్రతికే వారిలో ప్రియాంక సింగ్ ఒకరని ఈమె తెలిపారు.ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమాలలో ట్రాన్స్జెండర్ లు పాటిస్పేట్ చేసినప్పటికీ కేవలం కొన్ని వారాలు మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చారు. కానీ ప్రియాంక సింగ్ 12 వారాలు హౌస్లో ఉంది. ఈమెను తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి గెలిపించాలని ఈమె కోరారు.

ఇలా బిగ్ బాస్ విజేతగా ఒక ట్రాన్స్ ఉమెన్ నిలబడితే అది ఇండియాలోనే రికార్డ్ కు ఎక్కతుందని ఈమె తెలిపారు. అందుకే నా మద్దతు ప్రియాంక సింగ్ కి తెలుపుతున్నాను మీరు కూడా తనకు సపోర్ట్ చేసి తన ని గెలిపించండి అంటూ తమన్నా సింహాద్రి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

టికెట్ టు ఫినాలే ఛాన్స్ ఎవరికీ..? మొదటి ఛాలెంజ్ విన్నర్ వాళ్లేనా.?

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఎట్టకేలకు 12 వారాలు పూర్తి చేసుకొని.. 13 వ వారంలోకి అడుగుపెట్టింది. 19 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. 13 వ వారం వచ్చేసరికి షణ్ముఖ్, సన్నీ, సిరి, ప్రియాంక, కాజల్, మానస్ మరియు శ్రీరామచంద్ర ఉన్నారు. ఇక ఈ 7 మందిలో షణ్ముఖ్, సన్నీ తప్ప మిగిలిన వారు నామినేషన్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సిరి, మానస్, శ్రీరామ చంద్ర, ప్రియాంక మరియు కాజల్ లో తక్కువగా ప్రియాంక సింగ్ కు ఓట్లు పోల్ అవున్నాయి. అన్ అఫిషియల్ ఓటింగ్ లో ఈ సారి ప్రియాంక సింగ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ లో ఉన్న సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్ బాస్.

టికెట్ టు ఫినాలే టాస్క్ ను వాళ్లకు ఇచ్చాడు. దీనిలో మొత్తం మూడు ఛాలెంజ్ లు ఉంటాయి. మూడు ఆటల్లో ఎక్కువగా ఎవరు పాయింట్లు సాధిస్తారో వాళ్లు.. నేరుగా ఫైనల్ కు అడుగుపెడతారు. తొలి చాలెంజ్‌గా ‘ఐస్‌’టాస్క్‌ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో సన్ని, సిరి మధ్య కాస్త గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. వాళ్లు ఈ ఛాలెంజ్ లో గెలిచినట్లు కూడా సమాచారం అందుతోంది.

ఈ టాస్క్ తో మళ్లీ బిగ్ బాస్ టీఆర్ పీ రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఫైనల్ ల్లోకి ఎవరు అడుగుపెట్టారో తెలియాలంటే.. మరొక రోజు ఆగాల్సిందే. ఇక 12వ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి విషయంలో ఇంకా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రవిని అన్యాయంగా బలి చేశారంటూ.. అతడి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.