తమన్నా సింహాద్రి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన ఈమె సీరియల్ నటుడు రవి కృష్ణతో గొడవ పెట్టుకొని ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే ఈమె ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో నిలబడ లేదనే చెప్పాలి.అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా తమన్నా సింహాద్రి బిగ్ బాస్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి ఈమె ఒక వీడియోని చేస్తూ ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మీడియా చేస్తూ చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. సాధారణంగా ట్రాన్స్జెండర్ అంటే చాలా మందికి రోడ్డుపై వచ్చి పోయే వారిని డబ్బులు అడిగే వాళ్ళుని భావిస్తారు నిజానికి ఎంతో మంది తమ తల్లిదండ్రులకు దూరంగా వచ్చి గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు.
అలా గౌరవంగా బ్రతికే వారిలో ప్రియాంక సింగ్ ఒకరని ఈమె తెలిపారు.ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమాలలో ట్రాన్స్జెండర్ లు పాటిస్పేట్ చేసినప్పటికీ కేవలం కొన్ని వారాలు మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చారు. కానీ ప్రియాంక సింగ్ 12 వారాలు హౌస్లో ఉంది. ఈమెను తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి గెలిపించాలని ఈమె కోరారు.
ఇలా బిగ్ బాస్ విజేతగా ఒక ట్రాన్స్ ఉమెన్ నిలబడితే అది ఇండియాలోనే రికార్డ్ కు ఎక్కతుందని ఈమె తెలిపారు. అందుకే నా మద్దతు ప్రియాంక సింగ్ కి తెలుపుతున్నాను మీరు కూడా తనకు సపోర్ట్ చేసి తన ని గెలిపించండి అంటూ తమన్నా సింహాద్రి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…