Tag Archives: pv sindhu

పీవీ సింధుకు ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిన మోడీ.. రాకెట్ గిఫ్ట్ గా ఇచ్చిన సింధు!

ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడలలో ఏడు పథకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పివి సింధు ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలను సాధించిన క్రీడాకారిణిగా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

తాజాగా భారతదేశానికి ఒలంపిక్ క్రీడలలో పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ సత్కారాలను చేశారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఈ క్రమంలోనే పీవీ సింధుతో మాట్లాడుతూ తనకు ముందుగా ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోతున్నట్లు తెలిపారు.ఒలంపిక్ క్రీడలలో భాగంగా గత కొంత కాలం నుంచి పీవీ సింధు ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం వల్ల కాంస్య పతకాన్ని గెలిచిందని ఈ క్రమంలోనే తనకు ఒక ఐస్ క్రీమ్ ఆఫర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని పీవీ సింధు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ దగ్గ రనుంచి అరుదైన గౌరవ సత్కారం లభించిందని తెలియజేశారు.

అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పీవీ సింధు చిన్న బహుమతిని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చినట్లు పీవీ సింధు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పీవీ సింధు ఒలంపిక్స్ లో ఆడినటువంటి బ్యాడ్మింటన్ బ్యాట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

సింధుతో శివారెడ్డి.. ఆమెకు ఏం గీప్ట్ ఇచ్చాడో తెలుసా!

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సింధు దేశ గర్వకారణమని అభినందించారు. అనంతరం సింధును సత్కరించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను బహూకరించారు రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. శివారెడ్డి తమ ఇంటి రావడం పట్ల సింధు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తను చేసే మిమిక్రీ చాలా బాగుంటాయంటూ శివారెడ్డిని అభినందించారు.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో-2021 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం అందరికి తెలిసిందే. వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతాకాలను గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది.