Tag Archives: railways

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

Crime: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీల కోసం ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫీ లకు ఫోజులు ఇవ్వడం కోసం ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకొని ప్రాణాలతో చెలగాటం ఆడటం వల్ల ఎన్నో ప్రమాదా సంఘటనలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల బారిన పడి కొంత మంది ప్రాణాలతో బయట పడగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

ఇప్పటికే ఎంతోమంది కొండ చివరి భాగంలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం, నది ప్రాంతాలలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం వంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే రైలు చివరి భోగి పైకి ఎక్కి సెల్ఫీ దిగడం కోసం చేయి పైకి ఎత్తాడు. ఈ క్రమంలోనే అతని చేయి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో అతను విద్యుత్ ఘాతానికి గురయి కింద పడ్డాడు.అయితే అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

తలకు తీవ్ర గాయం.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..

ఇలా విద్యుత్ ఘాతంతో రైల్వే భోగి నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి అనంతరం అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చనిపోడానికి రైల్వే ట్రాక్ వరకు వెళ్లిన జబర్దస్త్ కంటెస్టెంట్స్..!

మనస్సుకు ప్రశాంతంగా ఉండాలంటే దాదాపు చాలామంది చూసే ప్రోగ్రాం జబర్దస్త్. అంతగా అందులో కామెడీ ఉంటుంది. నవ్వుల జంక్షన్, కమెడియన్ల ఫన్ ప్లేస్ ఎక్కడ అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ వేదిక మాత్రమే. గత ఏడేళ్లకు పైగా ఈ వేదికపై ఎన్నో రకాలుగా నవ్వుల హంగామా చేశారు జబర్దస్త్ వీరులు. కమెడియన్స్ పంచ్ డైలాగ్స్‌కి తోడు కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ ప్రోగ్రాం ఎంత టాప్ లో ఉంటుందో.. నిర్వాహకులు రిలీజ్ చేసే ప్రోమోలు కూడా అంతే ఉంటాయి. ప్రోమోలతో రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించడం ఈ జబర్దస్త్ నిర్వాహకుల స్పెషాలిటీ. తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎముందంటే.. ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీలోనే కనిపిస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చే ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో కూడా నవ్వులు పూయించాడు.

ఆదితో కలిసి పంచులు విసురుతూ, కామెడీను పండించాడు. వాటమ్మ వాట్ ఈజ్ దిసమ్మా అంటూ వచ్చే సాంగ్ లో మొదట డ్యాన్స్ వేస్తూ కనిపిస్తారు. సచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటి అన్నా అంటూ రామ్ ప్రసాద్ ను ఆది అడుగుతాడు. దానికి అతడు తనకు బస్సు పడదురా.. అందుకే ఇలా వచ్చాను అంటూ పంచ్ వేస్తాడు.

చనిపోవడానికి రామ్ ప్రసాద్, ఆది ట్రాక్ పై కూర్చోవడంతో.. ఇక్కడ వద్దురా.. ట్రాక్ తుప్పుపట్టింది.. ఇన్ ఫెక్షన్ అవుతుంది అంటూ పంచ్ వేస్తాడు ప్రసాద్. తర్వాత రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ.. సూసైడ్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చారా సార్ అంటూ అడుగుతాడు రాజు. అవును అంటూ రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారు సార్.. కొన్ని రోజులు ఆగితే మీరే పోయేవారు కదా అంటూ పంచ్ వేస్తాడు రామ్ ప్రసాద్.

టీటీఈ అవతారమెత్తిన దొంగ.. చివరికి అలా పట్టుబడ్డాడు?

రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎవరి సామాన్లకు వారే బాద్యులు అంటూ ప్రకటనలు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ రైల్వే స్టేషన్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఆ స్టేషన్ లోనే టిఫిన్ చేసేందుకు పక్కనే ఉన్న నల్లా వద్ద చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు.

తన వద్ద ఉన్న బ్యాగ్ ను పక్కన ఉన్న ఓ టేబుల్ వద్ద ఉంచాడు. చేతులు శుభ్రం చేసుకొని వచ్చే సరికి అతడి బ్యాగ్ మాయం అయిపోయింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు. ఆ బ్యాగ్‌లో తన యూనీఫామ్, చలాన్ల బుక్ ఉన్నాయి అని ఆ టీటీఈ చెప్పాడు. అవి తనకు ఎంతో ఉపయోగం అంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అనుకున్నట్లుగానే ఆ బ్యాగ్ ను ఓ దొంగ పిల్లిలాగా వచ్చి దొంగిలించాడు.

అతడు ధరించిన డ్రస్ కలర్ ఆధారంగా అతడు ఎటు వైపు వెళ్లాడో ఆ సీసీ కెమెరాలను చెక్ చేశారు. చివరకు అతడు రైలు ఎక్కి వెళ్లిపోయినట్లు సీసీటీవీలో కనపడింది. ఆ రైలు ఎక్కడికి వెళ్తుంది అనేది కనుకున్నారు. అది హౌరా-అమృత్‌సర్ పంజాబ్ మెయిల్ ట్రైన్ ఎక్కాడు. అతడి పేరు గోవింద్ సింగ్. రైల్లో ఆ నల్లకోటు ధరించి టికెట్ అడుగుతూ.. టికెట్ లేని ప్రయాణికుల్ని బెదిరిస్తూ డబ్బు లాక్కుంటున్నాడు. ఆ పనిలో ఉండగా ఆ రైల్లో ఉండే మరో టీటీఈ ఎదురయ్యాడు.

ఎందుకు నా పని నువ్వు చేస్తున్నావు.. నీవు ఎవరు అంటూ నిలదీశాడు. దీంతో అతడు ఆ బోగీ నుంచి మరో భోగీకి పారిపోయడు. చివరకు అతన్ని బిజ్నోర్‌లోని నిజామాబాద్ స్టేషన్‌లో పట్టుకున్నారు. తిరిగి ఆ యూనీఫామ్‌ని TTE జస్వంత్ సింగ్‌కి బ్యాగ్‌తో సహా ఇచ్చారు. రియల్ టీటీఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.

రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

భారతీయ రైల్వే ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కోసం కొత్త కోర్సులను ప్రకటించింది. https://nrti.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విద్యా సంస్థ ద్వారా రైల్వే శాఖ రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులకు అవసరమైన శిక్షణను ఇస్తోంది. రైల్వే శాఖ బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, బీఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ కోర్సులు మూడేళ్లు, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కోర్సులు నాలుగేళ్ల పాటు చదివే విధంగా కోర్సులను రూపొందించింది.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను మాత్రం రైల్వే శాఖ రెండేళ్ల పాటు విద్యార్థులు చదివే విధంగా రూపొందించింది. ఎంఎస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ఎంబీఏ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు రెండు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది.

రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన కొత్త కోర్సులు నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించేవిగా ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తూ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం

రైలు ప్రయాణికులకు శుభవార్త.. పండుగకు 200 ప్రత్యేక రైళ్లు?

మరి కొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే కేంద్రం లాక్ డౌన్ నిబంధనల అమలులో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు టికెట్లను చాలా రోజుల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నారు. మరోవైపు కేంద్రం ఆంక్షలు సడలించినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నా టికెట్ ఛార్జీలను భారీగా పెంచడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూడటమే మానేశాయి. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ కావడంతో 200 ప్రత్యేక రైళ్లను నడపటానికి సిద్ధమవుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ ఇప్పటికే ప్రత్యేక రైళ్లకు సంబంధించి జోన్ల ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. రైళ్లు నడిపే నమోదవుతున్న కేసులను ఏయే రూట్లలో రైళ్లను నడపాలనే విషయం గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యేక రైళ్లను ఈ నెల 15 నుంచి రైల్వే శాఖ నడిపే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల సూచనల మేరకు రైళ్లను నడిపే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లను రైల్వే శాఖ నడపనుందని తెలుస్తోంది. పండగ సమయంలో రైల్వే శాఖ తీపికబురు చెప్పడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైతే రైళ్ల సంఖ్యను మరింత పెంచాలని కీలక సూచనలు చేస్తున్నారు.