మనస్సుకు ప్రశాంతంగా ఉండాలంటే దాదాపు చాలామంది చూసే ప్రోగ్రాం జబర్దస్త్. అంతగా అందులో కామెడీ ఉంటుంది. నవ్వుల జంక్షన్, కమెడియన్ల ఫన్ ప్లేస్ ఎక్కడ అంటే వెంటనే గుర్తొచ్చేది జబర్దస్త్ వేదిక మాత్రమే. గత ఏడేళ్లకు పైగా ఈ వేదికపై ఎన్నో రకాలుగా నవ్వుల హంగామా చేశారు జబర్దస్త్ వీరులు. కమెడియన్స్ పంచ్ డైలాగ్స్‌కి తోడు కాస్త గ్లామర్ టచ్ ఇస్తూ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ ప్రోగ్రాం ఎంత టాప్ లో ఉంటుందో.. నిర్వాహకులు రిలీజ్ చేసే ప్రోమోలు కూడా అంతే ఉంటాయి. ప్రోమోలతో రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించడం ఈ జబర్దస్త్ నిర్వాహకుల స్పెషాలిటీ. తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఎముందంటే.. ఆటో రామ్ ప్రసాద్, ఆది ప్రోమో ఎంట్రీలోనే కనిపిస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చే ఆటో రామ్ ప్రసాద్ హైపర్ ఆది స్కిట్ లో కూడా నవ్వులు పూయించాడు.
ఆదితో కలిసి పంచులు విసురుతూ, కామెడీను పండించాడు. వాటమ్మ వాట్ ఈజ్ దిసమ్మా అంటూ వచ్చే సాంగ్ లో మొదట డ్యాన్స్ వేస్తూ కనిపిస్తారు. సచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటి అన్నా అంటూ రామ్ ప్రసాద్ ను ఆది అడుగుతాడు. దానికి అతడు తనకు బస్సు పడదురా.. అందుకే ఇలా వచ్చాను అంటూ పంచ్ వేస్తాడు.
చనిపోవడానికి రామ్ ప్రసాద్, ఆది ట్రాక్ పై కూర్చోవడంతో.. ఇక్కడ వద్దురా.. ట్రాక్ తుప్పుపట్టింది.. ఇన్ ఫెక్షన్ అవుతుంది అంటూ పంచ్ వేస్తాడు ప్రసాద్. తర్వాత రైజింగ్ రాజు ఎంటర్ అవుతూ.. సూసైడ్ చేసుకోవడానికి మీరు కూడా వచ్చారా సార్ అంటూ అడుగుతాడు రాజు. అవును అంటూ రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారు సార్.. కొన్ని రోజులు ఆగితే మీరే పోయేవారు కదా అంటూ పంచ్ వేస్తాడు రామ్ ప్రసాద్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…