Featured

పర భాషా నటులు మనవాళ్ళను మెప్పిస్తారా.. ?

ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. మన టాలీవుడ్‌కు పరభాషా నటులు రావడం కొత్తేమీ కాదు. అలాగే ముంబై ముద్దుగుమ్మలు, మోడల్స్ వచ్చి పాతుకుపోతున్నవారూ ఉన్నారు. మన తెలుగు వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. తెలుగులోనే అద్భుతమైన నటులున్నారు. అయినా పక్క రాష్ట్రం వారిని తీసుకొచ్చి అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారని సీనియర్ నటులు కోట శ్రీనివాస్ లాంటి వారు ఓ వైపు చురకలంటిస్తున్నా.. ఇక్కడ టాలెంట్ ఉంటే ఎవరైనా వచ్చి సత్తా చాటవచ్చు అనే విధంగా పరభాషా నటీ నటులకు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు.

ప్రేక్షకులు కూడా అలాంటి నటీ నటులను బాగానే ఆదరిస్తున్నారు. కేవలం ప్రకాశ్ రాజ్‌ను మాత్రమే కాదు యాత్ర సినిమాతో మమ్ముట్టి, జనతా గ్యారేజ్ మూవీతో మోహన్ లాల్, మహానటి సినిమాతో ఆయన కొడుకు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లాంటి వారు వాచ్చి మంచి పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, ఆయన భార్య నజియా, కిచ్చా సుదీప్ ఇలా చాలామంది నటీ నటులు తెలుగు ఇండస్ట్రీలో కీలక పాత్రలు పోషించే అవకాశాలు అందుకుంటున్నారు.

ఇక్కడ ప్రేక్షకుల్లో కూడా వీరికి మంచి గుర్తింపు ఆదరణ దక్కుతున్నాయి. అయితే వీరంతా క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్నారు. వారి భాషలలో హీరోగా నటించినా కూడా మన తెలుగులో మాత్రం క్యారెక్టర్ మాత్రమే దక్కుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన టాలీవుడ్ మీద తమిళం, మలయాళం ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఇక్కడ హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్‌లో సూర్యకు స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. కానీ ఆయన ఇప్పటి వరకు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేదు.

కానీ విజయ్ మాత్రం గ్రాండ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. మహేశ్ బాబుతో చేయాల్సిన కథనే నిర్మాత దిల్ రాజు – దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ హీరోగా ఇక్కడ రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కబోతోంది. అలాగే ధనుష్ కూడా తెలుగులో స్ట్రైట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకుడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ సినిమా రూపొందుతుండగా, లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించే  అవకాశాలున్నాయట.

ఇక మరో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు జాతి రత్నాలు సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన కె వి అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఇక్కడ మన హీరోలకే సరిగా అనుకున్న ప్రాజెక్ట్స్ చేయలేకపోతున్నారు. చేసిన సినిమాలతో హిట్స్ దక్కక ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నారు. అలాంటిది ఇతర భాషలలోని హీరోలు వచ్చి ఇక్కడ నిలబడగలరా అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి వీరంతా తెలుగులో హిట్ కొట్టి సత్తా చాటుతారా లేదా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago