Featured

కీర్తి కెరీర్ డేంజర్ జోన్‌లో లేనట్టే.. వాళ్ళ రెమ్యునరేషన్ అందుకోవడమే టార్గెట్..?

గత ఏడాదిగా కీర్తి సురేశ్ సినిమా కెరీర్ డేంజర్ జోన్‌లో ఉందని మాట్లాడుకున్నవారే ఎక్కువ. అందుకు కారణం మహానటి సినిమా తర్వాత కీర్తి ఎంచుకున్న సినిమాల వల్లే ఇలా మాట్లాడుకున్నారు. ఏ హీరోయిన్ అయినా మంచి మైల్ స్టోన్‌లా మిగిలిపోయే సక్సెస్ వచ్చాక కెరీర్‌ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్లాన్స్ అన్నీ వారే ఊహించని విధంగా రివర్స్ అవుతుంటాయి. కీర్తి విషయంలో కూడా ఇదే జరిగింది. మహానటి లాంటి హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్, గొప్ప నటి బయోపిక్ మూవీతో వచ్చిన క్రేజ్‌తో ఆమె వరుసగా మూడు హీరోయిన్ సెంట్రిక్ ఫిలింస్ ఒప్పుకుంది.

ఇక్కడే కీర్తి సురేశ్ పెద్ద రాంగ్ స్టెప్ వేసింది. మూడు సినిమాలలో ఒకటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ఎంచుకొని రెండు మంచి కమర్షియల్ సినిమాలు కమిటయి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని చాలామంది మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా ఈ మాటలను ఎవరైనా ఏకీభవించవచ్చు. కానీ వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకోవడం వాటిని త్వర త్వరగా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకు రావడం వరకు బాగానే ఉంది. చెప్పాలంటే ఆమె నటించిన గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల మీద భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

అయితే కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో వచ్చిన పెంగ్విన్ సినిమా ఫ్లాప్ సినిమాగా ఎప్పుడైతే మిగిలిందో కొంత కెరీర్‌కు దెబ్బపడింది. ఈ సినిమాలో నటనపరంగా కీర్తిని ఎవరూ నెగిటివ్‌గా కామెంట్ చేయలేదు. కానీ ఆమె ఎంచుకున్న కథ సరైంది కాదని కామెంట్స్ చేశారు. ఈ సినిమా సక్సెస్ కీర్తిని కూడా బాగానే డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా సినిమా మీద బాగానే అంచనాలు పెరిగాయి. చెప్పాలంటే పెంగ్విన్ సినిమా ప్రభావం మిస్ ఇండియా మీద పడలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా కీర్తికి నచ్చిందని మాత్రం రిలీజ్ అయ్యాక మాట్లాడుకున్నారు.

మరీ చెత్త పాయింట్ అనేంతగా మిస్ ఇండియా సినిమా చూసిన వారు కామెంట్స్ చేశారు. సామాన్య ప్రేక్షకుడు కూడా మిస్ ఇండియా సినిమా కథ ఏంటీ ఇలా ఉంది అని మాట్లాడేలా సినిమాను తీశారు. దాంతో కీర్తి కెరీర్ ఒక్కసారిగా డేంజర్ జోన్‌లో పడినట్టైంది. అందుకే మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేసినా కూడా దాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ధైర్యం చేయలేకపోయారని టాక్ వినిపించింది. అయితే కీర్తి మంచి నటి కావడంతో ఆమె ఫ్లాప్ సినిమాలను పక్కనపెట్టి అవకాశాలు ఇచ్చారు. అలా రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తారు హిట్ అందుకుంది.

ఇక సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంకాస్త ఆమెకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. దాంతో మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే అణ్ణాత్త రిలీజైంది. రిజల్ట్ విషయం పక్కన పెడితే ఇందులో కీర్తి పర్ఫార్మెన్స్‌కు మంచి పేరొచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాను చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమెకు వచ్చే క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇదే క్రమంలో నానితో మరోసారి దసరా సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇప్పుడు కీర్తి టార్గెట్ పూజా హెగ్డే, రష్మిక మందన్న. వారిలా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకోవాలని గట్టిగా టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. 

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago