టాలీవుడ్ లో అగ్రహీరోలుగా కొనసాగుతున్న హీరోలల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఒకరు. వీళ్లను హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం మల్టీ స్టారర్స్ గా తెరకెక్కుతుండటంతో ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే.. ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది.
వాళ్లు వేసిన ఫాస్ట్ డ్యాన్స్ కు అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా చేశాయి. ఈ నాటు నాటు అనే పాటు ప్రస్తుతం నేషనల్ లెవల్లో ఓ రచ్చ రేపుతోది. ఈ పాటను చంద్రబోస్ రాసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబోస్ రాసిన ఈ లిరిక్స్ లో కొన్ని తప్పులు ఉన్నట్లు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
ఎర్రజొన్నతో రొట్టెలు.. కీసుపిట్ట కూసినట్టు అంటున్నావ్?. కీసుపిట్ట అనేది విజిల్.. దానికి అదే ఎలా కూస్తుంది చంద్రబోసు గారు.. రాసే ముందు ఆలోచించొద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు.
సీనియర్ గా పేరున్న చంద్రబోసుకు ఈ మాత్రం తెలవదా అంటూ చురకలు అంటించారు. దీనిపై చంద్రబోసు లేదా ఆర్ఆర్ఆర్ చిత్రం సభ్యులు ఎలా స్పందిస్తారో లేదో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…