Featured

ఆహాలో బోల్డ్ కంటెంట్‌కు బాగానే స్పేస్ ఇస్తున్నారు.. ఇలాంటి వెబ్ సిరీస్ ఇప్పుడు తప్పనిసరి..!

దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫాంస్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫిక్ల్స్, జీ 5 యాప్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ సహా పలు ఓటీటీలు ఒకదానికొకటి బాగా పోటీపడుతూ డిజిటల్ రంగంలో సత్తా చాటుతున్నాయి. రాను రాను సినిమాను  థియేటర్స్‌కు  వెళ్ళి చూసే ప్రేక్షకులు చాలా శాతం తగ్గుతుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ లాంటి వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూడరని మేము అనడం లేదు. కానీ ఇంతకముందులా థియేటర్స్‌లోనే వెళ్ళి సినిమా చూడాలనే మైండ్ సెట్ మారిపోతుందని చెప్పుకొచ్చారు.

గత ఏడాది నుంచి కరోనా సినిమాల విషయంలో జనాల మైండ్ సెట్ దాదాపు మార్చివేసింది. 2.1, 5.1 వన్ ఉన్న హోమ్ థియేటర్స్‌లో చక్కగా కూర్చొని సినిమా చూడొచ్చుననే ఆలోచనకి ప్రేక్షకులను తీసుకువచ్చింది. ఎంతైనా థియేటర్ ఫీల్ వేరే అని మన స్టార్ హీరోలు, దర్శక..నిర్మాతలు చెప్పుకొస్తున్నా..మాకు సేఫ్టీ కూడా ముఖ్యం, డబ్బు ఆదా కూడా చాలా అవసరం అనే థాట్‌లో జనాలు కొంత శాతం అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్స్ కంటే స్మాల్ స్క్రీన్‌కే జనాల ప్రాధాన్యత బాగా పెరిగింది.

ఇక గత ఏడాది నుంచి ఓటీటీలకి ఇదే రేంజ్‌లో ఆదరణ దక్కుతోంది. ఒక సినిమాను ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూసే విధానానికి చాలావరకు అలవాటు పడ్డారు. దీన్ని దృష్ఠిలో పెట్టుకొనే అన్నీ సినిమా ఇండస్ట్రీలలోని మేకర్స్ ఎక్కువ రిస్క్ చేయకుండా తమ సినిమాలకు భారీ ఆఫర్ వస్తే ఓటీటీలతో ఢీల్ కుదుర్చుకొని సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల తెలుగులో నారప్ప వచ్చి మంచి హిట్ సాధించింది. తమిళ హీరో సూర్య కూడా తన రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసి భారీ విజయాలను, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

అందుకే అల్లు అరవింద్ కూడా ఎక్కువగా డిజిటల్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. అంతర్జాతీయ ఓటీటీలకు ధీటుగా ఆహాను తీసుకువచ్చారు. మొదట్లో ఆహాకు అంతగా ఆదరణ దక్కలేదు. అయితే నెమ్మదిగా చిన్న సినిమాలను టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో వెబ్ సిరీస్‌లను టాక్ షోస్‌ను తీసుకువచ్చి ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేశారు అల్లు అరవింద్. ఆహాలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలలో రిలీజై హిట్‌గా నిలిచిన చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను తెలుగులో డబ్ చేసి ప్రేక్షకులకు ఆహా ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంత బోల్డ్ కంటెంట్‌ను తీసుకువస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌తో రూపొందుతున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు బాగానే ఆదరణను దక్కించుకుంటున్నాయి. అంతకముందు పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అనగనగా ఓ అతిథి అనే మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇదే క్రమంలో ఇప్పుడు త్రీ రోజెస్ అనే మరో వెబ్ సిరీస్ వచ్చింది. ఇందులో ఈషా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి మారుతి పర్యవేక్షకుడు. మాగీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలాంటి కంటెంట్‌తో ఆహాకు మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ ప్లాన్. ఇలాంటివి మరినీ రాబోతున్నాయి.  

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

26 minutes ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

7 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

8 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

9 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

1 day ago