2012 సంవత్సరలో పెళ్లి బంధంతో ఒకటైన జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్. సైఫ్ కి ఇది రెండో వివాహం. అంతక ముందు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అయిన అమృతా సింగ్ నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సైఫ్, కరీనా వివాహ బంధం.. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాఫీగా సాగిపోతోంది.
అతడికి మొదటి భార్యకు ఇద్దరు సంతానం. అందులో సారా అలీ ఖాన్, ఇబ్రహీంలు.. రెండో భార్య కరీనాకు తైమూర్, జహంగీర్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో సైఫ్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.
తాజాగా అతడు బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. దీనిలో హీరోయిన్ గా రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. వీళ్లిద్దరుకలిసి ఇటీవల కపిల్ శర్మ షోకి హాజరయ్యారు. ఇందులో సైఫ్ ని కపిల్ ఓ ప్రశ్న అడుగుతాడు. అందేంటంటే.. ఇలా వరుస సినిమాలు చేయడానికి గల కారణం ఏంటి.. పనిమీద ప్రేమతోనా.. లేదా ఇంటి బాధ్యతలు ఎక్కువ కావడం వల్లనా అంటూ అడుగుతాడు.
ఇలా సినిమాలు తీయడం ఫ్యామిలీ కోసం కాదు.. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ పిల్లలు పుడతారేమో అనే భయంగా.. వర్క్ లో బిజీ అయిపోతున్నానంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు నవ్వు ఆగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి ఆ షోకి హాజరైన వాళ్లలో కొందరు.. కరీనా అంతలా మిమ్మల్ని టెంప్ట్ చేస్తుందా అంటూ సెటైర్లు వేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…