మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీకి సంబంధించి ప్రతీ ఒక్కరూ యాక్టివ్ గానే ఉంటారు. మంచు మనోజ్, మంచు విష్ణు కూడా ఎప్పుడూ యాక్టివ్ ఉంటారు. తండ్రి మోహన్ బాబు నట వారసత్వాన్ని ఒంట బట్టించుకొని కొన్నేళ్ల క్రితమే సినీరంగ ప్రవేశం చేశారు మంచు లక్ష్మి.
2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి అడపాదడపా సినిమాలు చేస్తోన్న లక్ష్మికి సరైన బ్రేక్ రాలేదు. బుల్లితెరపై కూడా ఎన్నో ప్రోగ్రాంలను చేశారు. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌లో నటిస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఆమెపై ఎలాంటి ట్రోలింగ్స్ వచ్చినా ఘాటుగా సమాధానం ఇస్తుంది.
నెగెటివ్ గా ట్రోల్ చేస్తే మాత్రం వాళ్లకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. అయితే మంచు లక్ష్మి తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కొటేషన్ ఉంది. ఎంటంటే.. మనకు ఉన్న భయాన్ని వదిలేస్తే.. జీవితం బాగుంటుందని.. హద్దులు లేకుండా ఉంటామని.. అందుకే ప్రేమను పంచుతూ భయాన్ని వీడాలని ఓ కొటేషన్ ను షేర్ చేశారు.
ఆ ట్వీట్ ఓ అభిమాని.. మేడం టుడే నా భర్త్ డే.. విష్ చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. పెట్టిన వెంటనే మంచు లక్ష్మి స్పందిస్తూ.. హ్యాపీయెస్ట్ బర్త్ డే అంటూ నెటిజన్ కు రిప్లై ఇచ్చింది. ఇంకేముంది.. అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మీరు చేసిన ఈ ట్వీట్ ఎన్నటికీ మర్చిపోలేను.. నేను మీకు పెద్ద ప్యాన్ మేడం అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…